Moviesఏ హీరోయిన్ కి చెప్పని మాటను ..నిత్యా మీనన్ కు చెప్పిన...

ఏ హీరోయిన్ కి చెప్పని మాటను ..నిత్యా మీనన్ కు చెప్పిన తారక్.. ప్రణతి షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయే నటులు చాలా తక్కువ . వివాదాలకు దూరంగా కాంట్రవర్షియల్ వర్డ్స్ కి చాలా దూరంగా ఉండే నటులలో నందమూరి హీరో తారక్ కూడా ఒకరు . జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన తాత తరువాత..బాలకృష్ణ తరువాత.. నందమూరి అభిమానులను మెప్పిస్తున్న హీరోగా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే ఋఋఋ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన..త్వరలోనే కొరటాల డైరెక్షన్లో ఓ సినిమాలో నటించబోతున్నాడు.

కాగా తారక్ చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు . మరీ ముఖ్యంగా అమ్మాయిలతో దూరంగా ఉండి మాట్లాడతారు . సరదాగా ఉన్నా కానీ తన హద్దుల్లో ఉంటాడు .ఆడపిల్ల జీవితం చాలా సెన్సిటివ్ అని పొరపాటున మన వల్ల ఒక నింద వస్తే ఆ బాధను తట్టుకోలేరు అంటూ ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. అయితే తన సినీ కెరియర్లో తారక్ చాలా మంది హీరోయిన్స్ తో నటించారు. చాలామందితో రెండు మూడు సార్లు సినిమాల్లో కలిసి నటించాడు. అయితే ఏ హీరోయిన్ కు చెప్పని మాటను తారక్ మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ కి చెప్పాడట . అంతే ఒక్కసారిగా ఆ మాట విన్న ఆయన భార్య లక్ష్మీ ప్రణతి షాక్ అయిందట . అంతలా ఎందుకు షాక్ అయిందంటే ఇప్పటివరకు ఆ రేంజ్ లో ఆమెను కూడా పొగడ లేదట.

జనరల్గా తారక్ కి సిగ్గు ఎక్కువ అస్సలు పొగడడు ..అమ్మాయిల్ని పొగడం పెద్దగా తెలియదు . అయితే నిత్యామీనన్ యాక్టింగ్ చూసి మాత్రం తారక్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేశారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్టర్ చేశారు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా సమంత కూడా నటించింది. అయితే సమంత కన్నా చిన్న క్యారెక్టర్ అయినా నిత్యామీనన్ పాత్ర జనాలకు మనసుకు హత్తుకునింది . మరీ ముఖ్యంగా తారక్ నిత్యామీనన్ కాంబోలో వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో తారక్ నిత్యామీనన్ గురించి కచ్చితంగా మాట్లాడుతూ.. “ఆమెతో కలిసి నటిస్తానని.. ఇప్పటివరకు నేను అలా సహజ సిద్ధంగా నటించే నటిని చూడలేదని.. మరో సావిత్రి గారిలా అనిపించారని” ఓ రేంజ్ లో పొగిడేసారు. దీంతో అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news