Moviesవాడికి అది త‌ప్పా ఏం రాదు... ద‌గ్గుబాటి అభిరాం గాలి మొత్తం...

వాడికి అది త‌ప్పా ఏం రాదు… ద‌గ్గుబాటి అభిరాం గాలి మొత్తం తీసేసిన శ్రీరెడ్డి…!

శ్రీ రెడ్డి పేరు తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఆమె చూపించిన తెగువ మామూలుగా లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం అమ్మాయిలను ఎలా వాడుకుంటారో చాలా ఓపెన్ గా చెప్పేసింది. ఆమె మీటు మూమెంట్‌, కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని నడిపించిన తీరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు సైతం భయపడ్డారు అంటే శ్రీరెడ్డి డేరింగ్‌ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆమె చేసిన పనులు మాట్లాడిన మాటలు కాస్త అతిగా ఉన్నా తాను మాత్రం ఎక్కడ తగ్గేదేలే అని ధీమాగా ఉంటుంది. శ్రీరెడ్డి దెబ్బతోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి… తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పారు.

ఫిల్మ్‌ చాంబర్ ముందు శ్రీరెడ్డి చేసిన అర్థనగ్న ప్రదర్శనతో ఆమె పేరు ఒక్కసారిగా జాతీయ మీడియాలో సైతం మార్మోగిపోయింది. అలాగే తెలుగు సినిమా రంగంలో పెద్ద ఫ్యామిలీ అయినా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన దగ్గుబాటి అభిరామ్‌పై శ్రీరెడ్డి తీవ్రమైన విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కింది. అసలు దగ్గుబాటి ఫ్యామిలీపై ఎవరైనా విమర్శలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటిది శ్రీరెడ్డి సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ తనను అవకాశాలు ఇప్పిస్తానని దారుణంగా వాడుకుని… సర్వస్వం దోచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

అభిరామ్ అవసరాలు తీరాక తనను వదిలేసాడని చెప్పడంతో పాటు… అభిరామ్ తనతో ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేసింది. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు… సెల్ఫీలను శ్రీరెడ్డి బయట పెట్టడంతో అభిరామ్ ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అయ్యాడు. అయితే శ్రీ రెడ్డి చేసిన విమర్శలకు అభిరామ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా అభిరామ్ తేజ దర్శకత్వంలో తన తొలి సినిమా అహింసతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అహింస పోస్టర్లు వైరల్ అవుతుండడంతో శ్రీరెడ్డి తన తాజా ఇంటర్వ్యూలో అభిరామ్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తూ గాలి తీసేసింది. అహింసనా నేను అస్సలు వినలేదు.. అయినా వాడికి హింస తప్ప ఇంకేమీ రాదే… అహింస అనే సినిమాతో వస్తున్నాడా ? అన్న టైపులో కౌంటర్లు వేసింది. వస్తే రానివ్వండి చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి… ఇది ఏమాత్రం ఆడుతుందో చూద్దాం అన్నట్టుగా సెటైర్ వేసింది.

ఏదేమైనా అహింస సినిమా ప్రమోషన్లు ప్రారంభమైన వెంటనే శ్రీ రెడ్డి ఆ సినిమాతో పాటు అభిరామ్‌ను గట్టిగా టార్గెట్ చేసేందుకు కాచుకొని ఉందని ఆమె మాటలే చెబుతున్నాయి. ఇక తెలుగు బిగ్ బాస్ షో మీ ద మరోసారి శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో నిప్పులు కురిపించింది. అది షోనా అన్నట్టుగా కౌంటర్లు వేయడంతో పాటు తాను చస్తే అ షోకు వెళ్లనని… ఆ షోకు వెళితే ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నట్టు అవుతుందని బిగ్ బాస్ పై తనకున్న వ్యతిరేకత వ్యక్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news