Moviesభర్త విడాకులు ఇవ్వటంతో కోర్టులోనే షాక్ తిన్న చిరంజీవి హీరోయిన్‌... ట్విస్ట్...

భర్త విడాకులు ఇవ్వటంతో కోర్టులోనే షాక్ తిన్న చిరంజీవి హీరోయిన్‌… ట్విస్ట్ ఇచ్చిన భ‌ర్త‌…!

టి రాజేందర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ప్రేమసాగరం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ నళిని. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో నళిని.. చిరంజీవి హీరోగా నటించిన సంఘర్షణ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకున్నారు. సంఘ‌ర్ష‌ణ సినిమా బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇంటిగుట్టు అనే సినిమాలో కూడా చిరుకు జోడీగా న‌ళిని హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లు పడటంతో నళిని స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ ను సంప‌పాదించుకుంది.

ప్రేమ‌సాగ‌రం సినిమాలో ఆమె చూపించిన అందాలు అప్ప‌ట్లో కుర్ర‌కారుకు మాంచి మ‌త్తెక్కించేశాయి.
ఇక ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లను అందుకుంది. అయితే కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే నళిని ప్రముఖ తమిళ నటుడు రామ‌రాజ‌న్ ను ప్రేమించింది. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నళిని – రామరాజన్ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన‌ నళిని పిల్ల‌ల బాధ్యతలు చూసుకుంటూ కాలం గ‌డిపారు.

ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చారు. సినిమాలలో ముఖ్యమైన పాత్రలు చేయడంతో పాటు టీవీ సీరియల్స్ మరియు టీవీ షోలలో సందడి చేశారు. ఇప్పటికీ నళిని సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నళిని పెళ్లి తర్వాత చాలా ఏళ్లపాటు వైవాహిక‌ జీవితంలో హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తన భర్తతో విడిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నళిని కూతురు అరుణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తమ తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అరుణ ఆమె బయటపెట్టారు. నళిని కూతురు అరుణ మాట్లాడుతూ…. విడాకులు తీసుకున్నప్పటికీ తమ తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటార‌ని తెలిపింది. ఒకరి గురించి మరొకరు చెడుగా చెప్పుకునే వారు కాదని తెలిపింది.

అంతేకాకుండా కోర్టులో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేసినట్లు తీర్పు ఇచ్చిన వెంటనే తన తల్లి కళ్ళు తిరిగి పడిపోయిందని తెలిపింది. దాంతో వెంటనే తన తండ్రి వెళ్లి పట్టుకున్నారని… ఆ విధంగా ఇద్దరు ఎంతో ప్రేమించుకునే వారని చెప్పింది. ఆ సన్నివేశం చూసిన న్యాయమూర్తి ఇంత ప్రేమ ఉన్నా ఇద్దరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని ఆశ్చర్యపోయారని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news