Moviesకీర్తి సురేష్ ఖర్మ ఇక అంతేనా..అందుకే, ఇలాంటి పనులకి తెగించిందా..?

కీర్తి సురేష్ ఖర్మ ఇక అంతేనా..అందుకే, ఇలాంటి పనులకి తెగించిందా..?

కీర్తి సురేష్ ఖర్మ ఇక అంతేనా..అందుకే, ఇలాంటి పనులకి తెగించిందా..? అంటూ ఆమె ఫ్యాన్సే ఈ మధ్య కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం డీసెంట్ హీరోయిన్ అనే పేరున్న కీర్తి సురేష్ మరీ బరితెగించినట్టుగా ప్రవర్తిస్తూ ఫొటో షూట్స్ చేస్తుండటమే. సర్కారు వారి పాట సినిమా ముందువరకు కీర్తి ఉన్న విధానం ప్రతీ ఒక్కరికీ విపరీతంగా నచ్చింది. కీర్తి సురేష్‌ది ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్. అమ్మ సీనియర్ నటి మేన‌క‌. నాన్న నిర్మాత. కీర్తికి ఏ విషయంలోనూ ఇబ్బందులు లేవనే చెప్పాలి.

తలుచుకుంటే వాళ్ళే తమ కూతురును హీరోయిన్‌గా పెట్టి సినిమాలు చేసేస్తారు. మలయాళంలో మాత్రమే కాదు ఒకే సినిమాను పాన్ ఇండియా లేవల్‌లోనూ నిర్మించగలరు. కానీ, కీర్తికి సొంత సంస్థలో సినిమా చేసే అవకాశం బయట సంస్థలు ఇవ్వడం లేదు. తమిళం, తెలుగు మాత్రమే కాకుండా మలయాళం భాష నుంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే, కీర్తి సురేష్ గురించి మాట్లాడుకుంటే మహానటి సినిమాకి ముందు ఆ తర్వాత అని చెబుతున్నారు.

మహానటి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత అదే ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేయాలని ఆశపడింది. అందుకే, కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ఎక్స్‌పరిమెంట్స్ చేసింది. కానీ, ఆ ఎక్స్‌పరిమెంట్స్ అన్నీ దారుణంగా వికటించాయి. మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కీర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత చేసిన ప్రతీ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో కెరీర్ డైలమాలో పడింది.

అందుకే, ఇంతకాలం ఒద్దికగా, పద్ధతిగా కనిపించిన ఈ మహానటి ముదురు భామలా మారింది. నెవర్ బెఫోర్ అనేట్టుగా మారింది. ఒక్క సర్కారు వారి పాట సినిమాలోనే తన కాస్ట్యూమ్స్‌ కాస్త హద్దులు దాటడానికి రెడీ అనే సంకేతాలను ఇచ్చింది. ఈ సినిమాలో మాస్ హీరోయిన్‌గా కనిపించి ఆకట్టుకుంది. అయినా సినిమా ఫ్లాప్ అయింది. దాంతో కీర్తి ఖర్మ ఇక ఇంతేనా..? చేసిన సినిమాలన్నీ బాల్చీ తన్నేస్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా మడికట్టుకుంటే కష్టమనే ఆలోచనతో సెమీ స్కిన్ షో అనేట్టుగా ఇప్పుడు అందాల ఆరబోతతో ఫొటో షూట్స్ చేస్తూ రెచ్చిపోతుంది.

 

ఒకరకంగా ఈ ఫొటో షూట్స్ జనాలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మేకర్స్ దృష్ఠి కూడా కీర్తి మీద మరోలా పడుతోందట. నానితో నటిస్తున్న దసరా సినిమాలో అమ్మడి గ్లామర్ ట్రీట్ గట్టిగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news