Moviesరష్మిక సేఫ్ గేమ్ బ‌ట్ట బ‌య‌లు... ముందుంది ముస‌ళ్ల పండ‌గే...!

రష్మిక సేఫ్ గేమ్ బ‌ట్ట బ‌య‌లు… ముందుంది ముస‌ళ్ల పండ‌గే…!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సేఫ్ గేమ్ ఆడుతుందనుకుంటోంది. కానీ, ఇక్కడ ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా తారుమారవుతుందో ఎవరూ ఊహించలేరు. అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్స్‌కి పరాభవాలు తప్పలేదు. ఒక స్టేజ్‌కి వచ్చాక కొన్ని సినిమాలు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకొని దెబ్బతింటే కొన్ని సినిమాలను అవగాహన లేక ఒప్పుకొని దెబ్బతింటారు. ఇంకొన్ని సినిమాలను..భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా అని ఒప్పుకొని కెరీర్‌ను ఇబ్బందుల్లో వేసుకుంటున్నారు. సినిమా కెరీర్ కోసం పెళ్లిని కూడా లెక్క చేయలేదు రష్మిక మందన్న.

తను ఎంగేజ్‌మెంట్ చేసుకొని కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఓ క్లారిటీ వచ్చేసరికి చేసుకున్న నిశ్చితార్థాన్ని కూడా రద్దుచేసుకుంది. అంత సాహసం చాలా తక్కువమందే చేస్తారు. చేసినా రెండిటికి చెడ్డ రేవడిలా మారేవారే ఎక్కువ. అలాంటి సాహసం చేసిన రష్మిక కరెక్ట్ డెసిషన్ తీసుకుందని అందరూ మెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్‌లో తను చేసిన మొదటి సినిమాతో మంచి హిట్ అందుకొని అందరి దృష్ఠిని ఆకర్షించింది. వరుసగా అవకాశాలు ఓడిసిపట్టుకుంటుంది.

కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు లాంటి వారి సరసన అవకాశం అంటే చాలా గొప్ప విషయం. రష్మిక లక్కుకొద్దీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. చెప్పాలంటే పూజా హెగ్డే కంటే కూడా ఎక్కువ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఏకంగా బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు అందుకుంటూ వస్తోంది.

అయితే, రష్మిక ఇక్కడే మరీ అత్యాశకి వెళ్లిందని చెప్పుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి మెగాస్టార్‌తో కలిసి సినిమా చేసే అవకాశం గొప్ప అదృష్ఠమే. కానీ, ఈ సినిమా రష్మిక మందన్న కెరీర్‌కి ఎంతమాత్రం ఉపయోగపడింది లేదు. హిందీలో చేసిన మొదటి సినిమా డిజాస్టర్. అయినా అక్కడ చేస్తున్న మిగతా సినిమాల విషయంలో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం..కొత్తగా కమిటయ్యే ప్రాజెక్ట్స్ విషయంలో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వంటివి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మనవాళ్ళు ఎప్పుడు ఏ హీరోయిన్‌ను పైకి లేపుతారో..ఎప్పుడు ఎవర్ని కిందకి పడేస్తారో చెప్పలేము. వాడినన్ని రోజులు బాగానే వాడతారు. బాగానే పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఎక్కడైనా చిన్న తేడా జరిగితే, అడ్రస్ లేకుండా చేస్తుంటారు. మరి మందన్న చేస్తున్నదేంటో గానీ..ఆమె కెరీర్ రానున్న రోజుల్లో అంత ఆసక్తికరంగా సాగదనే టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news