Moviesత్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2ను బీట్ చేసిన కాంతారా.. రికార్డుల మోత...

త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2ను బీట్ చేసిన కాంతారా.. రికార్డుల మోత మోగిస్తోందిగా..!

క‌న్న‌డ సినిమాను కేజీయ‌ఫ్ 2ను మించి ఓ ఊపు ఊపుతోన్న కాంతారా సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఈ రికార్డుల మోత‌లో ఏకంగా త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2 సినిమాల‌ను మించిన రేటింగ్‌తో దూసుకుపోతోంది. క‌న్న‌డ సంచ‌ల‌నం రిషిబ్ శెట్టి న‌టించ‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా వచ్చిన త్రిబుల్ ఆర్, కేజిఎఫ్ 2 రికార్డులను సైతం బ్రేక్ చేసి సంచలనాలతో దూసుకుపోతోంది.

ఇప్పటికే ఐఎమ్‌డీబిలో 8.4 రేటింగ్ తో కేజీఎఫ్ 2 ఉండగా… ఇప్పుడు కాంతారా 9.5 రేటింగ్ తో అదరగొట్టింది. దీంతో అత్యధిక రేటింగ్ సాధించిన భారతీయ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కాంతారా అసాధారణమైన రికార్డు సాధించడంతో కన్నడ సినీ ప్రియులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా రిషిబ్ శెట్టి ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించారు.

కేజిఎఫ్ సీరిస్‌ నిర్మాత విజయ్ కిరాంగదుర్ హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 30న ఒక మామూలు సినిమాగా శాండ‌ల్‌వుడ్లో రిలీజ్ అయిన కాంతారా రోజురోజుకు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసేందుకు ఈ సినిమా మేకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు కాంతారా తెలుగులో అల్లు అరవింద్ ఆధ్వర్యంలో రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే హిందీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా అలరిస్తోంది. ఈ సినిమాపై పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఫెంటాస్టిక్ గా ఉందని.. రిషిబ్ శెట్టి నటన తనను ఎంతో ఆకట్టుకుందని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మెచ్చుకోగా… తాజాగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమాను తాను రెండోసారి చూశానని.. ఇటీవల కాలంలో తనకు బాగా అనుభూతి ఇచ్చిన సినిమా అని ప్రశంసించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news