Moviesసోష‌ల్ మీడియాలో మెగా VS నంద‌మూరి వార్‌... చిరు, బాల‌య్య‌ను అలా...

సోష‌ల్ మీడియాలో మెగా VS నంద‌మూరి వార్‌… చిరు, బాల‌య్య‌ను అలా పోలుస్తూ…!

సోషల్ మీడియాలో మెగా అభిమానులు.. నందమూరి అభిమానుల మధ్య ఎప్పుడూ మాటలతూటాలు పేలుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని… మా హీరో సినిమా రికార్డులు క్రియేట్ చేసిందని ఎవరికి వారు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు క్యాంపులకు చెందిన అభిమానులు తమ హీరో గొప్ప అని.. తమ హీరో సినిమా రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకుంటే పర్వాలేదు. తమకు ఆపోజిషన్ లో ఉన్న హీరో సినిమాను తక్కువ చేసి చూపిస్తూ.. మా హీరో సినిమా ముందు ఆ హీరో సినిమా రికార్డులు ఎందుకు పనిచేయవని అటువైపు అభిమానులను రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ ఉంటారు.

బాలయ్య అఖండ సినిమా వచ్చినప్పుడు మెగా క్యాంపు నుంచి కొందరు అభిమానులు ఆ సినిమాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ కరోనా దెబ్బతో క్రైసెస్ లో పడింది. అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా అన్న సందేహాలు ఉన్నాయి. అదే సమయంలో బాలయ్య మెగా ఫ్యామిలీకి చెందిన ఆహా ఓటీటీలో అన్‌స్టాప‌బుల్ షో చేస్తున్నారు. అదే టైంలో అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరో బన్నీ ఛీప్ గెస్ట్ గా హాజరయ్యారు. గత మూడేళ్లుగా బన్నీ వర్సెస్ మెగా అభిమానుల మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది.

బన్నీ బాలయ్య సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లటం మెగా అభిమానుల్లో చాలామందికి నచ్చలేదు. దీంతో మెగా అభిమానుల్లో కొందరు అఖండ సినిమాను ట్రోల్ చేశారు. అయితే అఖండకు సినిమా ఇండస్ట్రీతో పాటు మిగిలిన హీరోలు… వారి అభిమానుల నుంచి మంచి సపోర్ట్ రావడంతో సూపర్ హిట్ అయింది. అఖండ తర్వాత చిరు నటించిన ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ అయింది. దీంతో ఆచార్యకు అఖండకు పోలిక లేకుండా పోయింది. అయితే అఖండ సినిమాను ట్రోల్ చేయడంతో బాలయ్య అభిమానులు కూడా ఆచార్య‌ను చూడవద్దంటూ ట్రోల్ చేశారు.

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయింది. ఇది మల‌యాళ హిట్ సినిమా లూసిఫర్‌కు రీమేక్ గా తెరకెక్కింది. మెగా అభిమానులు కొందరు గాడ్ ఫాదర్ సినిమా తొలి రోజు కలెక్షన్లు అఖండను మించిపోయాయని… చిరంజీవి రీమిక్ సినిమాతో బాలయ్య డైరెక్ట్ సినిమా వసూళ్లను క్రాస్ చేశారంటూ ట్రోల్ చేస్తున్నారు. తొలిరోజు కలెక్షన్లు మాత్రమే కాదు.. తొలి మూడు రోజుల కలెక్షన్లు కూడా గాడ్ ఫాదర్- అఖండ మధ్య పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నందమూరి, మెగా అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు. నంద‌మూరి అభిమానులు మాత్రం గాడ్ ఫాద‌ర్ కంటే అఖండ తొలి రోజు వ‌సూళ్లే ఎక్కువ‌ని చెపుతున్నారు.

సోష‌ల్ మీడియా ఫిగ‌ర్స్ ప్ర‌కారం అఖండ కంటే గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు కాస్త ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ఏరియాలో మాత్రం గాడ్ ఫాదర్ కంటే అఖండ సినిమా వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే అఖండ లాంగ్‌ర‌న్‌లో ఏకంగా రూ. 200 కోట్ల వ‌సూళ్లు రాబట్టిందని… నైజాంలోను తిరుగులేని వసూళ్లు కొల్లగొట్టిందని గాడ్ ఫాదర్ కూడా లాంగ్‌ర‌న్‌లో ఎంత వసూళ్లు రాబడుతుందో చూశాక.. మీరు సవాళ్లు చేయాలని బాలయ్య, నందమూరి అభిమానులు మెగా అభిమానులకు కౌంటర్లు విసురుతున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోల అభిమానుల సమరంలో చిరంజీవి- బాలయ్యను అన‌వ‌స‌రంగా లాగేసి గోల చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news