Moviesచిరంజీవి కెరీర్ లోనే సరి దిద్దుకోలేని తప్పు.. ఇప్పటికి బాధపడుతున్న మెగా...

చిరంజీవి కెరీర్ లోనే సరి దిద్దుకోలేని తప్పు.. ఇప్పటికి బాధపడుతున్న మెగా ఫ్యాన్స్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనకు సపరేట్ మార్కును క్రియేట్ చేసుకుని తన పేరు చెప్పుకుని నలుగురు సినీ ఇండస్ట్రీకి వచ్చేలా మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు తన పేరు ఉపయోగించుకొని కూడా సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు వచ్చారు . అది వేరే విషయం అనుకోండి…

అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. హిట్లు ప్లాపులు రెండు పడ్డాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మెగాస్టార్ నటించిన ప్రతి సినిమా హిట్ అయిం.ది ఒకవేళ ప్లాప్ అయినా కానీ అది డైరెక్టర్ ఫాల్ట్.. లేదా స్క్రిప్ట్ రాంగ్ గానే ఉంటుంది . అయితే ఫస్ట్ టైం డైరెక్షన్ పరంగా ..స్క్రిప్ట్ పరంగా.. నటన పరంగా చిరంజీవి కి అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న సినిమా ఒకటి ఉంది. అదే “అంజి”. పాపం ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పరమ చెత్త టాక్ సంపాదించుకుంది.

ఈ సినిమాను తెరకెక్కించింది. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ . సినిమాను ప్రొడ్యూస్ చేసింది శ్యాం ప్రసాద్ రెడ్డి . ఈ సినిమా 15 జనవరి 2004న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు ఈ సినిమాలో నటించి తప్పు చేసాను అంటూ చిరంజీవి కూడా బాధపడ్డారట. నిజానికి ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు కోడి రామకృష్ణ చిరంజీవికి చెప్పిన పాయింట్స్ బాగా నచ్చాయట .

ఇంప్రెస్ అయిపోయారట. కానీ తెరకెక్కించేటప్పుడు మాత్రం కోడి రామకృష్ణ మరోలా తెరకెక్కించారని.. ఈ కారణంగానే సినిమాలో విజువలైజేషన్ వారిని భారీగా దెబ్బేసిందని చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఇప్పటికీ చిరంజీవి ఖాతాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా ఏది అంటే అందరి ముందు చెప్పే సినిమా అంజి. ఈ సినిమా మెగా ఫాన్స్ ను ఇప్పటికి బాధపడుతూ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news