Movies60 ఏళ్ల ముస‌లాడితో క‌స్తూరి శంక‌ర్ ల‌వ్ ఎఫైర్... త‌ట్టుకోలేక ఏం...

60 ఏళ్ల ముస‌లాడితో క‌స్తూరి శంక‌ర్ ల‌వ్ ఎఫైర్… త‌ట్టుకోలేక ఏం చేసిందంటే..?

సీరియ‌ల్ న‌టి క‌స్తూరి అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ గా ర‌న్ అవుతున్న టీవీ సీరియ‌ల్స్ లో ఒక‌టి అయిన గృహ‌ల‌క్ష్మి సీరియ‌ల్లో క‌స్తూరి న‌టిస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఇక సీరియ‌ల్ లో క‌స్తూరి ఎంత ప‌ద్ద‌తిగా క‌నిపిస్తుందో బ‌య‌ట అంత బోల్డ్ గా ఉంటుంది మాట్లాడుతుంది. నిజానికి క‌స్తూరి ఒకప్పుడు హీరోయిన్ గా న‌టించింది అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. తెలుగుతో పాటూ త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో కస్తూరి సినిమాలు చేసింది. టాలీవుడ్ లో క‌స్తూరి నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా అన్న‌మ‌య్య‌లో న‌టించింది.

ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌గా కస్తూరి న‌ట‌న‌కు కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. కానీ ఈ సినిమా త‌రవాత మాత్రం క‌స్తూరి తెలుగు సినిమాల్లో క‌నిపించ‌లేదు. దానికి కార‌ణం త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లేన‌ని క‌స్తూరి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. అంతే కాకుండా త‌ను అంటే గిట్ట‌ని వారు త‌న గురించి బ్యాడ్ గా ప్ర‌చారం చేశార‌ని క‌స్తూరి ఆవేద‌న వ్యక్తం చేసింది. తమిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క‌స్తూరి ఓ 60 ఏళ్ల ముసలి వ్యాపార‌వేత్త‌తో సంబంధం పెట్టుకుంది అంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

కాగా ఆ విష‌యం గురించి కూడా కస్తూరి స్పందించింది. త‌న‌కు అర‌వై ఏళ్ల వ్యాపార‌వేత్త‌తో ఎఫైర్ అంట‌గ‌ట్టారు అని చెబుతూ క‌స్తూరి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సెల‌బ్రెటీల గురించి ఇలాంటి వార్త‌లు రావ‌డం స‌హ‌జం అని తాను అలాంటి రూమ‌ర్ ల‌ను ప‌ట్టించుకోన‌ని కస్తూరి వెల్ల‌డించారు. అయితే క‌స్తూరి తో ఎఫైర్ అంట‌గ‌ట్టిన ఆ ముస‌లి వ్యాపార‌వేత్త ఎవ‌రు అన్న‌ది మాత్రం బోల్డ్ న‌టి బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఇదిలా ఉండ‌గా క‌స్తూరి సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు.

ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా హీరోయిన్ రేంజ్ లో అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంటారు. ఇటీవ‌ల కేఎల్ రాహుల్ అండ‌ర్ వేర్ యాడ్ పై కస్తూరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అంతే కాకుండా ఓ సారి బిడ్డ‌కు పాలు ఇస్తున్న ఫోటోల‌ను షేర్ చేసి అంద‌ర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే క‌స్తూరి చాలా సార్లు వార్త‌ల్లో నిలిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news