Moviesబాల‌య్య‌, చిరు ఇద్ద‌రూ పంతానికే పోతున్నారా... మ‌ధ్య‌లో న‌లుగుతోన్న శృతీహాస‌న్‌..!

బాల‌య్య‌, చిరు ఇద్ద‌రూ పంతానికే పోతున్నారా… మ‌ధ్య‌లో న‌లుగుతోన్న శృతీహాస‌న్‌..!

బాల‌య్య‌, చిరంజీవి ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్లు న‌టిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. బాల‌య్య, మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక చిరు బాబి ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వీర‌య్య చేస్తున్నాడు. రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్ బ్యాన‌ర్లోనే వ‌స్తున్నాయి. రెండు సినిమాల్లోనూ శృతీహాస‌న్ హీరోయిన్‌.

అయితే ఈ రెండు సినిమాలు 80 శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. రెండు సినిమాల‌ను కూడా సంక్రాంతి బ‌రిలోనే దింపాల‌ని చిరు, బాల‌య్య ఇద్ద‌రూ పంతంతోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వంగా చూస్తే బాల‌య్య సినిమాను డిసెంబ‌ర్‌కు అనుకున్నారు. మ‌ధ్య‌లో బాల‌య్య‌తో పాటు టీంకు క‌రోనా రావ‌డంతో షూట్ లేట్ అయ్యింది.

దీంతో చిరు, బాల‌య్య ఇద్ద‌రి సినిమాలు సంక్రాంతికే అనుకుంటున్నారు. రెండు సినిమాలు మైత్రీ వాళ్ల‌వే కావ‌డంతోనే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఇద్ద‌రిలో ఎవ‌రినో ఒక‌రిని క‌న్విన్స్ చేసి ఒక సినిమా సంక్రాంతికి.. మ‌రో సినిమాను ఫిబ్ర‌వ‌రికి మార్చాల‌ని మైత్రీ వాళ్లు అనుకుంటున్నారు. కానీ ఎవ‌రు మాత్రం సంక్రాంతి లాంటి మంచి సీజ‌న్ వ‌దులుకుంటారు ?

ఇక బాల‌య్య సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ శృతీహాస‌న్ కాల్షీట్లు ఇచ్చింద‌ట‌. ఇప్పుడు ఆ సినిమా కోస‌మే ఆమె ప‌ని చేస్తోంది. మ‌రోవైపు చిరు సినిమాను కూడా సంక్రాంతి రేసులో అనుకోవ‌డంతో చిరు సినిమాకు కాస్త లేట్‌గా ఆమె కాల్షీట్లు ఇస్తోంద‌ని అంటున్నారు. ఈ రెండు సినిమాల‌కు ఆమె రాత్రి, ప‌గ‌లు ప‌ని చేయాల్సి వ‌స్తోంద‌ట‌.

ఇటు రెండు సినిమాలు సంక్రాంతికే అన్న‌ట్టుగా హీరోలు పట్టుబ‌డుతూ ఉండ‌డంతో మైత్రీ వాళ్ల‌తో పాటు శృతీహాస‌న్ కూడా న‌లిగిపోతోంద‌ట‌. అయితే మ‌ధ్యేమార్గంగా ఓ సినిమాను జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లోనూ… మ‌రో సినిమాను సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తే ఎలా ? ఉంటుందా ? అన్న ఆలోచ‌న‌లు కూడా మైత్రీ వాళ్లు చేస్తున్నారు. మ‌రి ఈ రెండు సినిమాల్లో ఎవ‌రు సంక్రాంతికి వ‌స్తారు ? ఎవ‌రు వెన‌క్కు త‌గ్గుతారు ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news