Moviesఈ బిచ్చ‌గాడు లవ్ స్టోరీ సూపర్.. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే...

ఈ బిచ్చ‌గాడు లవ్ స్టోరీ సూపర్.. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!

విజయ్ ఆంటోని.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ బిచ్చగాడు సినిమాలో హీరో అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఈ సినిమాలో ఆయన నటించిన పాత్ర ఆయన కనబరిచిన ప్రతిభ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆయన సైలెంట్ కిల్లర్ అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన నటన తెలుగు తమిళ జనాలను మెప్పించింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పిన ఒకటే ఒక మాట విజయ్ ఆంటోనీ కిల్లింగ్ పెర్ఫార్మన్స్. ఈ పాత్ర విజయ్ ఆంటోని తప్ప వేరొకరు చేయలేరు. చేసినా మెప్పించలేరు అంటూ సినీ ప్రముఖుల సైతం బిచ్చగాడు సినిమాను రేంజ్ లో హైలైట్ చేశారు .

 

అంతేకాదు ఈ సినిమా పెట్టిన దానికి ఐదు రెట్లు ఎక్కువ లాభాన్ని తీసుకొచ్చింది . దీంతో అప్పట్లో ఈ సినిమా బిచ్చగాడు టైటిల్ మాత్రమే కలెక్షన్స్ లో మాత్రం కోటీశ్వరులు అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. విజయ్ ఆంటోనీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లవ్ లైఫ్ గురించి ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయ్యారు. విజయ్ ఆంటోనీ చాలా తక్కువగా బయట కనిపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా తక్కువ . అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన అన్ని ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెబుతూ ..మరోసారి తనలోని మంచి గుణాన్ని చూపించారు. ఈ క్రమంలోనే ఆయన తన పెళ్లి లవ్ స్టోరీ గురించి వివరించి అభిమానులకు సరికొత్త మ్యాటర్ ని రివీల్ చేసారు.

విజయ్ ఆంటోనీ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు.. తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్టుని. ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు . విజయ్ ఫస్ట్ టైం తన లైఫ్ గురించి బయట పెట్టాడు. ఆమె పేరే ఫాతిమా. ఓ సినిమా సక్సెస్ మీట్ లో ఆమె ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఫాతిమా మొదటి లుక్స్ తోనే ఆయనకు పడిపోయింది .ఇదే విషయం ఆయనకు చెప్పిందట. దీంతో ఆమెకి మొదటి చూపుల కనెక్ట్ అయిన విజయ్ తన అభిప్రాయాలు ఆమె అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉన్నాయని ..లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే ఏమో అని చెప్పుకొచ్చారు.

ఆమెతో ప్రేమలో పడి 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. వీరికి లారా అనే కూతురు కూడా ఉంది. ప్రజెంట్ విజయ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక్కడ హైలెట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈయన.. ఆ తర్వాత నటుడిగా ..హీరోగా.. సినిమా ఎడిటర్ గా ..ఆ తర్వాత నిర్మాతగా అన్ని రంగాల్లోనూ సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే విజయ్ తన సంపాదించిన దానితో సగానికి పైగా ప్రజాసేవకే ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పరు. ఇది ఈయనలో దాగున్న మరో గొప్ప విషయం అని చెప్పక్క తప్పదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news