Moviesఆదిగాడిని ఏ చెప్పుతో కొట్టాలి.. గుర్రుగా ఉన్న స్టార్ హీరో ఫ్యాన్స్..ఏమైందంటే..?

ఆదిగాడిని ఏ చెప్పుతో కొట్టాలి.. గుర్రుగా ఉన్న స్టార్ హీరో ఫ్యాన్స్..ఏమైందంటే..?

హైపర్ ఆది.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగులతో.. వల్గర్ పంచులతో ..జబర్దస్త్ లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఢబుల్ మీనింగ్ డైలాగులతోనే ఎక్కువ పాపులర్ అయిన హైపర్ ఆది పంచ్ వేస్తే కచ్చితంగా అందులో బూతు పదం ఉండాల్సిందే . అంతలా తన పేరును మార్చేసుకున్నాడు ఈ హైపర్ ఆది. కాగా ప్రజెంట్ హైపర్ ఆది పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. దానికి కారణం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హార్ట్ చేయడమే .

మీకు డౌట్ రావచ్చు ఆది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే కదా మరి ఎందుకు ఆయన హర్ట్ చేస్తారు అని . ఆయన మాట్లాడిన మాటలకి అభిమానులు హర్ట్ అయ్యారు. అంతగా
హైపర్ ఆది ఏం మాట్లాడి పవన్ అభిమానుల్ని హర్ట్ చేశారు అనుకుంటున్నారా..?

రీసెంట్ గా ఆది షోలో మాట్లాడుతూ ..”జనరల్ గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని .పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆయన మాట విన్న ఆయన పాట విన్నా నాలో ఏదో తెలియని ఒక ఊపు వస్తుంది. ఆయన పాట వింటే తెలియకుండానే అరుపులు.. చేతికి తెలియకుండా చప్పట్లు.. వేళ్ళకు తెలియకుండా విజిల్స్ వేస్తాయి. నాకు తెలిసి మళ్ళీ ఆ స్థాయి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం ” అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు.

సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ మాటలు విని ఫిదా అయినా అదే మాటలు విన్న పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అయ్యారు. ” అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రా.. పవన్ స్థాయి ఎక్కడ..అతని స్దాయి ఎక్కడ.. అతనితో పవన్ కళ్యాణ్ కి పోలిక ఏంట్రా.. మీ షో హైలెట్ కోసం పవన్ ని వాడుకుంటావా బయట కనిపిస్తే చెప్పుతోనే కొడతాం” అంటూ మీమ్‌స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే డైరెక్ట్ గానే నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా హైపర్ ఆది.. ఒళ్ళు నోరు కంట్రోల్ లో పెట్టుకో.. అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో హైపర్ ఆది VS పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్ ముదిరిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news