Movies"ఘోస్ట్ " కోసం ఇష్టమైన దాని వదిలేసుకున్న నాగార్జున..నువ్వు గ్రేట్ సామీ..!?

“ఘోస్ట్ ” కోసం ఇష్టమైన దాని వదిలేసుకున్న నాగార్జున..నువ్వు గ్రేట్ సామీ..!?

సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుపోని విధంగా సీనియర్ హీరోలు సినిమాలు చేసుకుంటూ.. కుర్ర హీరోలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే యంగ్ హీరోల కన్నా ధీటుగా ఘాటుగా సీనియర్ హీరోలు రోల్స్ చూస్ చేసుకోవడం.. దానికి తగ్గట్టు షూటింగ్ పనులను పూర్తి చేయడం సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే టాలీవుడ్ కింగ్ నాగార్జున హ్యాండ్ సమ్ హీరో.. నవమన్మధుడు తన కొడుకుల కన్నా సరే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో . త్వరలోనే “ది ఘోస్ట్” సినిమా పేరుతో మన ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జున విభిన్నమైన రోల్ లో కనిపించనున్నాడని ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్ సినిమా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్గా సోనాలి చౌహాన్ నటిస్తుంది. నాగార్జున పక్కన హీరోయిన్ సోనాలి చౌహాన్ పర్ఫెక్ట్ ఫిగర్..అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 5 ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కానీ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కారణంగా నాగార్జున ఎక్కడో వెనకడుగు వేస్తున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతుంది.

అయితే ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున తనకి ఇష్టమైన పెట్స్ ని దూరం పెట్టాడట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ విదేశాల్లోనే చేశారట చిత్రబృందం. ఈ క్రమంలోనే నాగర్జున తనకు ఇష్టమైన పెట్స్ ని వదిలి దూరంగా కొన్ని నెలలు గడపాల్సి వచ్చిందట . దీనికి నాగార్జున తెగ బాధ పడిపోయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాల్లో స్పెషల్ రోల్ కోసం ఆయన కొందరు పెద్ద వ్యక్తులను కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడట . “ది ఘోస్ట్” సినిమా ఎలాగైనా సరే హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు నాగార్జున . మరి చూడాలి అఖిల్, నాగచైతన్య అందుకోలేని హిట్ రికార్డ్ నాగార్జున “ది ఘోస్ట్” తో అందుకుంటాడేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news