MoviesRRRకి ఆస్కార్ అవసరమా..యంగ్ హీరో సంచలన కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంటి...

RRRకి ఆస్కార్ అవసరమా..యంగ్ హీరో సంచలన కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంటి !?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే అంశం హాట్ టాపిక్ గా కనిపిస్తుంది. అదే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ్వకపోవడం. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ కి సెలెక్ట్ అవుతుంది అనుకున్నారు జనాలు.. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా ఆస్కార్ కి సెలెక్ట్ కాకపోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ జనాలు కూడా మెచ్చుకున్న ఈ సినిమాను ఆస్కార్ కి ఎందుకు నామినేట్ అవ్వలేదు అన్నదానిపై తెలుగు హీరోలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నిఖిల్ ఆర్ఆర్ఆర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

దర్శకుడు రాజమౌళి ఇద్దరు బడా హీరోలను పెట్టి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా “రణం రౌద్రం రుధిరం”. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును కొల్లగొట్టింది. ఇండియన్ సినిమా చరిత్రను తిరగ రాసిన ఘనత సాధించుకుంది . దీంతో సినిమాలోని భారీ విజువల్ ఎఫెక్ట్స్, నటన, ఎమోషన్స్, స్టోరీ అన్ని జనాలకు బాగా నచ్చేసాయి. హాలీవుడ్ ప్రముఖుల సైతం ఆర్ఆర్ఆర్ సినిమాను ఓ రేంజ్ లో పొగడేసారు. ఇది హాలీవుడ్ స్ధాయి సినిమా అని దర్శకుడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు.

అంతేకాదు కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అవుతుందని.. ఆస్కార్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా ఆస్కార్ కి ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అవ్వలేదు . దీంతో తెలుగు హీరోలు దీనిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..” ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవసరమా… ఆ అవార్డు మనకి నిజంగా అవసరం అంటారా.. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు.. ఆస్కార్ అవార్డు మనకి అవసరం లేదనుకుంటున్నాను . అదే నా ఫీలింగ్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దేశ విదేశాల ప్రేక్షకులు అభినందించారు. దానికంటే గొప్పదా ఈ ఆస్కార్.. అంత పెద్ద అంత గొప్ప విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ ఇవ్వకపోవడం వల్ల దురదృష్టం. అయినా మన సినిమాలకు వాళ్ల సర్టిఫికేట్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మనకి జాతీయ అవార్డ్స్.. ఫీలిం ఫేర్లు ఉన్నాయిగా..” అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతో నిఖిల్ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Latest news