Movies"బాగా పెరిగిపోయింది..అది తగ్గించుకో"..కాజల్ కు ఘోర అవమానం.. !?

“బాగా పెరిగిపోయింది..అది తగ్గించుకో”..కాజల్ కు ఘోర అవమానం.. !?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే . మొదటి సినిమా లక్ష్మి కళ్యాణం తోనే తనలోని నటనా టాలెంట్ ను బయటపెట్టి.. బిగ్ స్టార్స్ కళ్ళల్లో పడింది. ఇక ఆ తర్వాత రెండో సినిమానే రాజమౌళి దర్శకత్వంలో చేసే ఛాన్స్ కొట్టేసి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ అన్ని భాషల్లో ఉన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది.

ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. అంతే త్వరగా బాబుకు జన్మనిచ్చి అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు కాజల్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ పై ఫోకస్ పెట్టింది. భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంటూ తెలుస్తుంది .కాగా రీసెంట్ గా ఓ టాలీవుడ్ బిగ్ డైరెక్టర్ కాజల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారట. మీకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాను.. కానీ, దాని తగ్గించుకోమన్నారట.

” నీ డెలివరీ తర్వాత ఫేస్ బాగా లావు అయిపోయింది . బుగ్గలు లావుగా అయిపోయాయి.. కొంచెం వాటిని తగ్గించుకుంటే ..మళ్ళీ నువ్వు హీరోయిన్ లుక్ లోకి వస్తావు.. లేకపోతే ఆంటీలా ఉంటావు..” అంటూ ఆమెను పరోక్షంగా కామెంట్ చేశాడట . దీంతో ఇది కాజల్ కు ఘోర అవమానంగా చెప్పుకొస్తున్నారు ఆమె అభిమానులు . ఏ అమ్మాయికైనా సరే ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో కొన్ని మార్పులు వస్తాయి అది గమనించినటువంటి ఈ స్టార్ డైరెక్టర్ కాజల్ ను.. అంత మాట ఎలా అనగలడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు కాజల్ ఆఫర్ రిజెక్ట్ చేయడమే మంచిది అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. మరి చూడాలి కాజల్ అగర్వాల్ ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news