Moviesమంచు మ‌నోజ్ - భూమా మౌనిక పెళ్లికి ఫిక్స‌య్యే అలా చేస్తున్నారా...!

మంచు మ‌నోజ్ – భూమా మౌనిక పెళ్లికి ఫిక్స‌య్యే అలా చేస్తున్నారా…!

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి వార్తల్లోకి వచ్చి వైరల్ గా మారారు. వారిద్దరూ కలిసి హైదరాబాద్లో ఓ వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడంతో త్వరలోనే వారిద్దరు పెళ్లి చేసుకుని… భార్యాభర్తలు అవుతున్నారన్న వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. గతంలోనే వీరిద్దరికి వేరే వ్యక్తులతో పెళ్లై విడాకులు కూడా పూర్తయ్యాయి.

మనోజ్ కు ముందుగా ప్రణతి రెడ్డితో వివాహం జరగగా.. మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు వచ్చేసాయి. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇక మౌనిక రెడ్డికి ముందుగా బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో వివాహం జరగగా వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. ఇక విశ్వసనీయ‌ వర్గాల సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలుగా మనోజ్ – మౌనిక ఇద్దరూ కలిసి సహజ జీవనం చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది.

వీరు ఇద్దరు చెన్నైలోని ఓ ప్లాట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు మౌనిక రెడ్డికి మొదటి భర్త నుంచి ఇంకా విడాకులు రాలేదని… ఆ విషయం కోర్టులో పెండింగ్లో ఉందన్న ప్రచారం జరిగినా… తాజా సమాచారం ప్రకారం ఆమెకు విడాకుల పత్రాలు కూడా వచ్చేసాయట. అందుకే మనోజ్‌తో కలిసి అతడి ఇంట్లోనే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మనోజ్ – మౌనిక ఇద్దరు మానసికంగా భార్యాభర్తలు అయిపోయారని అందుకే సహజీవనం కూడా చేస్తున్నారని… సంక్రాంతికి ముందుగానే వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని అంటున్నారు.

ఇక మనోజ్ – మౌనిక పరిచయం కూడా ఈనాటిది కాదని.. వారిద్దరికి గత కొంత కాలంగా ప‌రిచ‌యం ఉన్న‌ద‌ని సమాచారం. అయితే మోహన్ బాబు మాత్రం వీరు పెళ్లి వరకు కాస్త ఓపిక పట్టాలని.. ఎలాంటి హడావుడి చేయకూడదన్న కండిషన్ పెట్టినా… మనోజ్ – మౌనిక కలిసి బయటకు రావడంతో వీరిద్దరి పెళ్లి వార్త బయటకు వచ్చేసింది. గతం నుంచే మోహన్ బాబు – భూమా కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేదట.

అప్పటమించే మనోజ్ – మౌనిక మధ్య పరిచయం ఉంది. అసలు వీరిద్దరూ కలిసి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట కూడా. అయితే మోహన్ బాబు అభ్యంతరాల‌ నేపథ్యంలో అప్పట్లో వీరి పెళ్లి జరగలేదని అంటున్నారు. ఏదేమైనా కొంతకాలంగా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉంటున్న మనోజ్ ఇప్పుడు ఓ రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు అన్న వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news