Moviesబాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డి మానియా ఏ రేంజ్‌లో ఉందంటే...!

బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డి మానియా ఏ రేంజ్‌లో ఉందంటే…!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల కాలంలో స్టార్ హీరోల ఓల్డ్ సినిమాల‌ను రీ రిలీజ్ చేసే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆ స్టార్ హీరోల పుట్టిన రోజు సంద‌ర్భంగా గతంలో వారు న‌టించి సూప‌ర్ హిట్ కొట్టిన సినిమాల‌ను తిరిగి ప్రీమియ‌ర్ షోలుగా వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అలా రీ రిలీజ్ చేసిన సినిమాలు కూడా క‌లెక్ష‌న్ల‌లో విజృంభిస్తున్నాయి. మ‌హేష్ పోకిరి, ఒక్క‌డు సినిమాల‌ను మ‌హేష్ బెర్త్ డే సంద‌ర్భంగా రీ రిలీజ్ చేశారు. ఇందులో పోకిరి ఎక్కువ షోల‌తో పాటు ఏకంగా భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

అయితే ప‌వ‌న్ జ‌ల్సా సినిమా కూడా పోకిరి వ‌సూళ్ల‌ను క్రాస్ చేసేసింది. చివ‌ర‌కు శృతీహాస‌న్ – ధ‌నుష్ త్రి సినిమాను సైతం నిర్మాత న‌ట్టి కుమార్ రీ రిలీజ్ చేస్తే మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు బాల‌య్య వంతు వ‌చ్చేసింది. బాల‌య్య న‌టించిన హిట్ సినిమా చెన్న‌కేశ‌వ‌రెడ్డిని రీ రిలీజ్ చేసే ప్లాన్ జ‌రుగుతోంది. బాల‌య్య ఫ్యాన్స్ కోరిక మేర‌కు ఇప్పుడు చెన్న‌కేశ‌వ‌రెడ్డిని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.

రీ రిలీజ్ నేప‌థ్యంలో ఈ భారీ మాస్ యాక్ష‌న్ సినిమా ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే షాకింగ్ రెస్సాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయో లేదో వెంట‌నే అడ్వాన్స్ బుకింగ్‌ల్లో ఈ సినిమా దుమ్ము రేపుతోంద‌ని తెలుస్తోంది. చెన్న‌కేశ‌వ‌రెడ్డి మానియా అయితే అదిరిపోయే లెవ‌ల్లో ఉంద‌నే అంటున్నారు.

 

బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీయా చ‌ర‌ణ్‌, ట‌బు హీరోయిన్లుగా న‌టించారు. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించ‌గా… ఆది త‌ర్వాత వివి. వినాయ‌క్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఆ రోజుల్లోనే 158 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 42 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news