Moviesబాల‌య్య కోసం అనుష్క‌... వావ్ కేక‌పెట్టించే కాంబినేష‌న్‌...!

బాల‌య్య కోసం అనుష్క‌… వావ్ కేక‌పెట్టించే కాంబినేష‌న్‌…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కేవ‌లం వెండితెర మీద మాత్ర‌మే కాదు… బుల్లితెర‌ను కూడా షేక్ చేసేస్తాన‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. అఖండ‌తో వెండితెర బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో దూసుకువ‌చ్చిన బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోతో కూడా త‌న క్రేజ్ అమాంతం పెంచేసుకున్నాడు. అస‌లు బాల‌య్య బుల్లితెర‌పై ఓ టాక్ షోను హోస్ట్ చేస్తాడా ? అన్న సందేహాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ ఈ షోను బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చేయ‌డంతో పాటు బుల్లితెర‌పై కూడా ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.

త‌న‌లో ఉన్న మ‌రో బాల‌య్య‌ను ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా… స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకున్నాడు. బాల‌య్య షో అన‌గానే కేవ‌లం ఆయ‌న అభిమానులు మాత్ర‌మే కాదు… సామాన్య జ‌నాలు, మాస్ అభిమానులు కూడా ఎన్నో ఆశ‌ల‌తో వెయిట్ చేశారు. వారి ఆక‌లి అంతా బాల‌య్య తీర్చేశాడు. అన్‌స్టాప‌బుల్ 1 బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఇప్పుడు అంద‌రూ సీజ‌న్ 2 కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఆహా వాళ్లు కూడా త్వ‌ర‌లోనే సీజ‌న్ 2 స్టార్ట్ అవుతుంద‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో పాటు.. ఇటు సీజ‌న్ 2లో పాల్గొనే వారి లిస్ట్ కూడా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డంతో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇప్ప‌టికే సీజ‌న్ 2లో చిరంజీవి, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అనుష్క పేరు కూడా లైన్లో ఉంది.

నిశ్శ‌బ్దం త‌ర్వాత అనుష్క పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే న‌వీన్ పోలిశెట్టి సినిమాలో మాత్రం న‌టిస్తోంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఏకంగా బాల‌య్య టాక్ షోలో పాల్గొని… బాల‌య్య ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చేయ‌డం అంటే మామూలు క్రేజ్ ఉండ‌దు. బాల‌య్య వేసే ప్ర‌శ్న‌లు.. అనుష్క జ‌వాబుల‌తో ఈ ఎపిసోడ్ రెండో సీజ‌న్‌కే పెద్ద హైలెట్ అవుతుంద‌నే చెప్పాలి.

గ‌తంలో వైవీఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క‌మ‌గాడు సినిమాలో బాల‌య్య‌కు జోడీగా అనుష్క న‌టించింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌లేదు.. ఎక్క‌డా క‌న‌ప‌డింది లేదు. మ‌రి ఇప్పుడు బాల‌య్య టాక్ షోకు అనుష్క వ‌స్తే చాలా పాత ముచ్చ‌ట్ల‌తో పాటు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

Latest news