Moviesసినిమాలోకి రావడం కోసం కృతిశెట్టి చేసిన ఈ పని తెలిస్తే.. మైండ్...

సినిమాలోకి రావడం కోసం కృతిశెట్టి చేసిన ఈ పని తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం అంటే మాటలు కాదు. దాని కోసం ఎంతో పట్టుదల కృషి టాలెంట్ అన్ని ఉండాలి. అన్ని ఉన్నా కానీ హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా కానీ ..ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలంటే.. దానికి టైం పడుతుంది . కానీ ఈ మధ్యకాలంలో కొందరి హీరోయిన్స్ కి ఒకే ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఆ టాప్ హీరోయిన్ లిస్టులో నుంచి దిగడం లేదు. ఆ లిస్ట్ లోకే వస్తుంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి.

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయినా ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన బ్యూటి కృతిశెట్టి. ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్.. ఆ తర్వాత నాగచైతన్య తో బంగార్రాజు..సినిమాలు చేసి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు హ్యాట్రిక్ హిట్లు కొట్టి సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్లిపోయింది.

అయితే ఇదేవిధంగా అమ్మడి కెరియర్ కొనసాగితే ఇక డొకా లేదు అంటూ సినీ విశ్లేషకులు సైతం భావించారు. మొదట మూడు సినిమాలు హిట్ అయితే ఆ తర్వాత పడిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. రామ్ తో నటించిన “ది వారియర్”.. నితిన్ “మాచర్ల నియోజకవర్గం”. రీసెంట్ గా సుధీర్ బాబుతో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కృత్తి అనుకున్న ఇమేజ్ ఆమెకు అందించలేకపోయాయి.

దీంతో కృతశెట్టి కెరియర్ టఫ్ కండిషన్ లో పడినట్లు అయింది. దీని కోసం కృత్తి ప్లాన్ బి స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది . అయితే మొదట్లో సినీ ఇండస్ట్రీకి రావడానికి కృతి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి కృతి వయసు చాలా చిన్నది ఇప్పుడున్న హీరోయిన్లతో కంపేర్ చేస్తే ఇంకా చిన్న పిల్లనే కృతి. ఇంత చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి రావడం ఆశ్చర్యకరం.

అంతేకాదు కృత్తికి పదో తరగతి చదువుతున్న టైంలోనే ఉప్పెన సినిమాలో ఆఫర్ వచ్చిందట. కాగా ఆ సినిమా షూటింగ్స్ కోసం ఆమె ఆమె మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఆపడానికి సిద్ధపడిందట. స్టడీస్ కన్నా సినిమాల ఇంపార్టెంట్ అంటూ పేరెంట్స్ తో వాదిచ్చిందట. కానీ ఎగ్జామ్స్ బ్యాలెన్స్ పెట్టూకోడానికి పేరంట్స్ ఒప్పుకోలేదట. బుచ్చిబాబుతో మాట్లాడి కృతి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే సినిమా షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్ కంప్లీట్ చేసారట. ఏదైనా కృతి అలా నిమిషాల్లో షార్ట్ డెసిషన్స్ తీసుకోవడం రాంగ్ అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news