Movies7/g సినిమా హీరోయిన్ సోనీని పెళ్లి చేసుకున్న ధనుష్ అన్న ఆ...

7/g సినిమా హీరోయిన్ సోనీని పెళ్లి చేసుకున్న ధనుష్ అన్న ఆ కార‌ణంతోనే విడాకులు ఇచ్చేశాడా…!

సినిమా తారలు ఎప్పుడు ప్రేమలో పడతారో ? ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఊహించలేం. చాలా మంది సినిమా తారలు ప్రేమ పేరుతో చెట్టా పట్టలేసుకుని తిరిగి ఆ తర్వాత విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతే కాకుండా పెళ్లి చేసుకుని విడిపోతున్న వాళ్ల లిస్ట్ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ -రేణు దేశాయ్ జంట నుంచి రీసెంట్ గా ధనుష్ – ఐశ్వర్య, సమంత – నాగచైతన్య వరకూ పెళ్లి చేసుకుని ఆ తర్వాత వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అదే లిస్ట్ లో హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా ఉంటారు.

సోనియా అగర్వాల్ తెలుగులో 7/g బృందావన కాలనీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరవాత సోనియా చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల సోనియా అగర్వాల్ రీసెంట్‌గా దివంగత గాయకుడు బాలు గారి కుమారుడు చరణ్ తో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా షురూ అయ్యారు. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ ఆ వార్త‌ల‌ను ఖండించాడు.

ఇదిలా ఉంటే సోనియా అగర్వాల్ కు గతంలో వివాహం జరిగింది. అది కూడా మరెవరో కాదు. కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ సోదరుడు రాఘవన్ తో సోనియా అగర్వాల్ పెళ్లి జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాఘవన్ 7/g సినిమాకు వహించగా ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరవాత పెళ్లి చేసుకున్న జంట కొన్నేళ్లకే మళ్లీ విడిపోయారు. అయితే పెళ్ల‌య్యాక కూడా సినిమాలు చేస్తాన‌న్న విష‌యంలో వారి మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌లేదు.

ఇక విడాకుల తరవాత రాఘవన్ మరో వివాహం చేసుకోగా ఆయనకు ఒక కూతురు పుట్టింది. సోనియాకు విడాకులు ఇచ్చేసిన సెల్వ రాఘ‌వ‌న్ రెండో పెళ్లి చేసుకుంది ఎవ‌రినో కాదు.. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ విద్యుల్లేఖ రామ‌న్ సోద‌రినే కావ‌డం విశేషం. కానీ సోనియా అగర్వాల్ మాత్రం సింగిల్ గానే ఉంటుంది. ఇక సోనియా అగర్వాల్ అభిమానులు కూడా ఆమె మరో పెళ్లి చేసుకుని జీవితం లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news