Moviesఐశ్వర్య రాజేష్‌కు అంత టాలెంట్ ఉన్నా టాలీవుడ్‌లో తొక్కేసింది ఎవ‌రు...!

ఐశ్వర్య రాజేష్‌కు అంత టాలెంట్ ఉన్నా టాలీవుడ్‌లో తొక్కేసింది ఎవ‌రు…!

ఐశ్వర్య రాజేష్‌లో టాలెంట్ ఉన్నా హీరోయిన్‌గా అవకాశాలివ్వకుండా తొక్కేస్తున్నారా..? ఇండస్ట్రీలో తనకి సపోర్ట్ దొరకడం లేదా..అంటే అవుననే తెలుస్తోంది. తండ్రి రాజేష్ మంచి నడుడు. ఆయన తమిళంలో పాటుగా తెలుగ్లోనూ సినిమాలు చేశారు. ఆయన నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది ఐశ్వర్య రాజేష్‌. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షో ద్వారా యాంకర్‌గా స్మాల్ స్క్రీన్ కి పరిచయమైంది.

ఆ తరువాత, అవగాళమ్ ఇవర్గలం (2011) లో సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయింది. అత్తాచాటి మూవీతో మంచి పేరు వచ్చింది. మొదటి మలయాళ చిత్రం జోమోన్నే సువిశ్శేంగల్. తర్వాత ఆమె నివిన్ పాలీతో సఖవు చిత్రంలో నటించింది. అర్జున్ రాంపాల్ సరసన డాడీ అనే హిందీ చిత్రంలోనూ నటించి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక 2014 లో ఐశ్వర్య రాజేష్‌ నటించిన కాక ముట్టై అనే తమిళ చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర నుంచి అవార్డును అందుకుంది.

ఇక తెలుగు తెరకు ‘కౌశల్య కృష్ణమూర్తి’ మూవీతో పరిచయమైంది. క్రికెట్ ఆట నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చేసిన ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలలో నటించింది. అయితే, తెలుగులో ఇవేవీ ఐశ్వర్య రాజేష్‌ కి సక్సెస్‌ను ఇవ్వలేదు. దాంతో ఇక్కడ కమర్షియల్ హీరోయిన్‌గా నిలవలేకపోయింది.

ఇలాంటి టాలెంటెడ్ హీరోయిన్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సుకుమార్, కొరటల శివ, అనిల్ రావిపూడి లాంటి దర్శకుల చేతిలో పడితే ఖచ్చితంగా కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ సాధిస్తారు. కానీ, మాములుగానే ఐశ్వర్య రాజేష్‌ కాస్త కలర్ తక్కువ అని గ్లామ‌ర్ పాత్రలు చేయలేదని టాక్ ఉంది. దానికితోడు ఎందుకనో మన వాళ్ళు పూజా హెగ్డే, రష్మిక మందన్నలను ఎంకరేజ్ చేసినట్టుగా ఐశ్వర్య రాజేష్‌ ని ఎంకరేజ్ చేయలేదు.

நீங்க போடுற டிரஸ் இது இல்லையே..! ஐஸ்வர்யா ராஜேஷ் Hot photos..! – Update News 360 | Tamil News Online | Live News | Breaking News Online | Latest Update News

ఒకరకంగా ఇక్కడ లెక్కలకి తను సరిపోదని తొక్కేసినట్టు ఆమె గురించి టాలీవుడ్‌లో చెప్పుకుంటారు. ఇక్క‌డ డైరెక్ట‌ర్ల‌తో పాటు కొంద‌రు నిర్మాత‌ల‌కు ఇవ్వాల్సిన‌వి ఇచ్చేందుకు ఆమె సిద్ధంగా లేద‌ని అంటారు. ఎవ‌రో ఎందుకు నిత్యామీన‌న్ కూడా ఎంత టాలెంట్ ఉన్న న‌టో తెలిసిందే. ఆమె ఇక్క‌డ ఎలా స్టార్ హీరోయిన్ కాలేదో చూశాం. ఇప్పుడు ఆమె బాట‌లోనే టాలెంట్ ఉండి కూడా టాలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్‌ సక్సెస్ కాలేదంటున్నారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news