Moviesఖుషి సినిమాలో ముందు అమీషా పటేల్... పవన్ వల్లే తీసేసి భూమికను...

ఖుషి సినిమాలో ముందు అమీషా పటేల్… పవన్ వల్లే తీసేసి భూమికను పెట్టారని తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ ఖుషి. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో రీమేక్ అయింది. అయితే, తెలుగులో హిట్ అయినట్టుగా మిగతా భాషలలో హిట్ అవలేదు. వరుసగా హిట్స్ అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ఖుషి మూవీతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఏ ఎం రత్నం నిర్మాత. ఆయన కెరీర్‌లో నిర్మాతగా మంచి హిట్ అందుకున్న సినిమా ఇది.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సింది. కానీ, అప్పుడు రెహమాన్ క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. దాంతో ఆయన తప్పుకున్నారు. ఆ స్థానంలో మెలోడి బ్రహ్మ మణిశర్మ వచ్చి చేరాడు. చాలామందిలో మణిశర్మ సంగీతం అంటే చాలా నమ్మకంగా ఉన్నారు. దానికి తగ్గట్టే తన మెలోడీస్‌తో అదిరిపోయే ఆల్బం ని ఇచ్చారు. నిజంగా రెహమాన్ ఇలాంటి ఆల్బం ఇచ్చేవారో కాదో తెలియదు. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా 105 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

ఇక హీరోయిన్‌గా ముందు భూమికను తీసుకోలేదు మేకర్స్. కహోనా ప్యార్ హై సినిమాతో సెన్షేషన్ సృష్ఠించిన అమీషా పటేల్‌ను ఎంచుకున్నారు. అంత‌కు ముందే అమీషా ప‌వ‌న్‌తో బ‌ద్రి సినిమా చేసింది.
కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ, పవన్ కళ్యాణ్ ఎక్కువగా అమీషాతో షికార్లు చేస్తూ షూటింగ్‌కి హాజరవలేదట. దానివల్ల అనుకున్న ప్రతీసారి ఖుషి చిత్రీకరణ వయిదా పడుతూ వచ్చిందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, అప్పట్లో మాత్రం ఈ విషయంలో రక రకాల వార్తలు వచ్చాయి.

ఇక ఇలా అయితే లాభం లేదనుకున్న మేకర్స్ అమీషా పటేల్‌ను తప్పించి ఆమె స్థానంలో భూమికను తీసుకున్నారు. అమీషా చేస్తే నిజంగా ఆ పాత్ర అందగా క్లిక్ అయ్యేదో లేదో తెలియదు గానీ, భూమిక మాత్రం దర్శకుడు అనుకున్నదానికంటే రెండింతలు అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా నడుము చూపిస్తూ తెరకెక్కించిన సీన్ అయితే కొన్ని వందలసార్లు చూసిన అభిమానులు, ప్రేక్షకులూ ఉన్నారు.

భూమిక బొడ్డుకు అప్పటి నుంచే ఫ్యాన్స్ అయినవారు లెక్కకి మించే ఉన్నారని చెప్పాలి. మొత్తానికి అమీషా పటేల్ నటించాల్సిన ఈ ఇండస్ట్రీ హిట్‌లో భూమిక వచ్చి చేరడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ అని చాలామందికి ఇప్పటికీ తెలియదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news