Moviesభారీ అందాల నమిత నిజంగానే ఆ స్టార్ డైరెక్టర్‌ను కొట్టించిందా..?

భారీ అందాల నమిత నిజంగానే ఆ స్టార్ డైరెక్టర్‌ను కొట్టించిందా..?

హీరోయిన్ నమిత గురించి ప్రతేకంగా చెప్పనవసరం లేదు. సొంతం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయమయ్యాడు. శ్రీను వైట్ల ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. సొంతం భారీ హిట్ కాకపోయినా కూడా ఈ సినిమా హీరో హీరోయిన్స్ ఇద్దరికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీ తర్వాత నమిత వెంకటేష్ సరసన జెమిని, ప్రభాస్ సరసన బిల్లా, బాలకృష్ణ సరసన సింహ లాంటి సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అయితే, నమిత అందరు హీరోల సరసన నటించడానికి సూటయ్యే ఫిజిక్ కాదనే విషయం ఆమెను చూస్తేనే తెలుస్తుంది. మంచి హైట్, బాగా బొద్దుగా ఉండటంతో కంప్లీట్‌గా కుర్ర హీరోల సరసన నటించడానికి సెట్ అవలేదు. పైగా కమర్షియల్ సినిమాలన్నిటికీ సూటవలేదు. దాంతో ఎక్కువకాలం నమిత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగలేదు. అయితే, ఇక్కడ మరో కారణం కూడా ఉందని అప్పట్లో బాగా ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకున్నారు.

నమితను ఓ దర్శకుడు ప్రైవేట్‌గా కలవమని కోరాడట. షూటింగ్‌లో భాగంగా ఊటీకి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చేటుచేసుకుందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కెరీర్ ప్రారంభంలో సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా ఐడియా లేక దర్శకుడు అలా కలవమని కోరినందుకు తన సన్నిహితులను పిలిచి వారితో దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిందని టాక్ వినిపించింది. ఇదే కాదు, చేయి కూడా చేసుకున్నారని ప్రచారం జరిగింది.

అయితే, ఇది నిజం కాదనేది నమిత తరపున వారు అప్పుడే క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ న్యూస్ చాలా కాలం స్ప్రెడ్ అవుతూనే ఉంది. నమిత దర్శకుడిని కొట్టించిందని బాహాటంగానే చాలా మంది మీడియా వాళ్లు వార్తలు రాశారు. మరి ఇది ఎంతవరకు నిజమో నమితకు, ఆ దర్శకుడికి మాత్రమే తెలియాలి. కాగా, ప్రస్తుతం నమిత పెళ్లి చేసుకొని హాయిగా తన ఫ్యామిలీతో గడుపుతోంది.

మ‌న తెలుగు వాడే అయిన వీరేంద్ర చౌద‌రిని న‌మిత ప్రేమ వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యింది. ఇటీవలే ఇద్దరు పండంటి కవలలకి జన్మనిచ్చింది. అంతేకాదు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news