Movies"నువ్వు సినిమాలకి పనికిరావు" ఆ మెగాహీరోకి ముందే చెప్పిన చిరంజీవి..సీన్ కట్...

“నువ్వు సినిమాలకి పనికిరావు” ఆ మెగాహీరోకి ముందే చెప్పిన చిరంజీవి..సీన్ కట్ చేస్తే..!?

సినిమా ఇండస్ట్రీలో బోలెడు ఉంది హీరోలు ఉన్నారు. వాళ్ళల్లో సగంకి పైగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే ఉండడం గమనార్హం. అలాంటి ఓ పేరు తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి . ఎటువంటి హెల్ప్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కొందరైతే ..ఆయన పేరు చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చి బ్రతుకుతున్న వారు మరికొందరు. అయితే అలా ఇండస్ట్రీకి వచ్చిన మెగా హీరోలలో ఒకరికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి ముందే..” నువ్వు సినిమా ఇండస్ట్రీకి పనికిరావు , నీలో ఆ గ్రేస్ లేదు “అంటూ చెప్పేశారట. కానీ ఆయన మాటల వినకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఫెయిల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఆ మెగా హీరో . ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..!!

మనకు తెలిసిందే చిరంజీవి ఫ్యామిలీ నుండి బోలెడు మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వాళ్ళల్లో కొందరు సక్సెస్ అయ్యారు కొందరు ఫెయిల్యూర్ అయ్యారు. కానీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువమంది. ఒకరో ఇద్దరో ముగ్గురు స్టార్ హీరోల లిస్టులోకి వెళ్లారు. కాగా అలా ఫెయిల్యూర్ అయిన హీరోల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్.

చిరంజీవి చిన్న కూతురు రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చేసిన అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఎక్స్ప్రెషన్స్ నిల్..నటన రాదు అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే నిజానికి కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అవ్వాలి అనుకున్న టైంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆయనకి అసలు విషయం చెప్పేసారట. ” గ్రేస్ లేదు నటనకు తగ్గ క్వాలిటీస్ లేవు.. హీరోగా కాకుండా ప్రొడ్యూసర్ గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తేనే నీకు మంచిది” అన్నట్లు చెప్పారట . కానీ కళ్యాణ్ దేవ్ ఆ మాటలను పట్టించుకోకుండా చిరంజీవిని సినిమా హీరో చేయమని మొండి చేశాడట. సీన్ కట్ చేస్తే ఆయన హీరో అయ్యాడో జీరో అయ్యాడో మనకు తెలిసిందే. ప్రజెంట్ కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news