Moviesఆమె స్పీడ్ కి తట్టుకోలేక పోయా..చిరంజీవి నోట ఊహించని మాట..!?

ఆమె స్పీడ్ కి తట్టుకోలేక పోయా..చిరంజీవి నోట ఊహించని మాట..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పేరు, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అడుగుపెడితే బాక్స్ బద్దలు అవ్వాల్సిందే.. కాలర్ ఎగరేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే ..అలా ఉంటది చిరంజీవి సినిమా అంటే. తన ఇన్నాళ్ళ కెరియర్లో చిరంజీవి ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు.. ఎంతో మంది ముద్దుగుమ్మలతో కాళ్లు కదిపారు . కానీ ఇన్నాళ్ల తన కెరియర్లో ఆయన ఓ హీరోయిన్ తో డాన్స్ చేయలేకపోయారట. ఆమె స్పీడ్ కి తట్టుకోలేకపోయారట.

ఈ విషయాన్ని స్వయాన మెగాస్టార్ చిరంజీవి చెప్పుకు రావడం గమనార్హం. మనకు తెలిసిందే సీనియర్ బ్యూటి రాధ , చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉంటుందో. తెరపై ఈ జంట కనిపిస్తే విజిల్స్ వేయాల్సిందే. ఇద్దరు ఆడి పాడితే జనాలు ఊగిపోతారు. అలా ఉంటది జంట. రాధా తో పోటీపడి డాన్స్ చేయలేనని ఇప్పటికే చిరంజీవి పాలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . అప్పటి తరం హీరోయిన్స్ లో రాధ అయితే ఇప్పటి హీరోయిన్స్ లో సమీరా రెడ్డి చిరంజీవితో డ్యాన్స్ చేయలేకపోయారట చిరు.వీళ్లిద్దరు కలిసి జై చిరంజీవ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈ బ్యూటీతో సమానంగా ఆడి పాడాడు చిరంజీవి .

కానీ జై చిరంజీవ సినిమాలోని “మహ ముద్దో చేస్తున్నావోయ్” అనే పాటలో చిరంజీవి సమీరా రెడ్డికి ధీటుగా స్టెప్స్ వేయలేకపోయాడట. “సమీరా రెడ్డి ఒక్కసారి కొరియోగ్రఫీ స్టెప్ చెప్పగానే పట్టేస్తుందని.. కానీ , నేను అలా చేయలేకపోయానని ఆమెతో డాన్స్ తో పోటి పడలేకపోయాను” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం అప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రజెంట్ సమీరారెడ్డి సినిమాలు లేక సోషల్ మీడియాకే పరిమితమైంది. చిరంజీవి భోళాశంకర్, గాడ్ ఫాదర్ , వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news