Moviesఇంత టాలెంట్ ఉన్న అంజ‌లిని మోసం చేసింది ఎవ‌రు... హీరో జైతో...

ఇంత టాలెంట్ ఉన్న అంజ‌లిని మోసం చేసింది ఎవ‌రు… హీరో జైతో బ్రేక‌ప్ ఎందుకు…!

అచ్చ తెలుగు అందం అంజలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదగటం లేదన్న విమర్శలకు చెక్‌ పెడుతూ ఆమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ అయింది. ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల పక్కన నటించి మంచి హిట్లు కొట్టింది. అంజలి తెలుగు అమ్మాయి అయినా ముందుగా కోలీవుడ్లో తన కెరీర్ ప్రారంభించింది. షాపింగ్ మాల్ సినిమాతో సౌత్‌ను ఒక ఊపు ఊపేసింది. అంజలి అంటే హోమ్లీ పాత్రలకు కేరాఫ్.

అంజలి అసలు పేరు బాలా త్రిపుర సుందరి. అయితే సినిమాల్లోకి వచ్చాక ఆమె తన పేరును అంజలిగా మార్చుకున్నారు. ముందుగా తమిళంలో స్టార్ హీరోయిన్ అయినా… ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా హిట్లు కొట్టారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు… హర్రర్ సినిమాలు చేసి కూడా హిట్లు కొట్టడం అంజలికే చెల్లింది. అంజలికి అటు చెన్నై, ఇటు హైదరాబాదులో రు. 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. అయితే ఆస్తుల విషయంలో ఆమెను సొంత కుటుంబ సభ్యులే మోసం చేశారని వాపోయింది.

ఆమె ఎంతో నమ్మి తన బంధువులకి తన ఆస్తులను చూసే బాధ్యతల అప్పగిస్తే… వారే చాలావరకు మోసం చేశారని అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. అంజలి ఒక్కో సినిమాకు రు. 80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది.పదేళ్లకు పైగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ టాప్ హీరోయిన్‌గా అయితే ఎదగలేదు. బాగా బొద్దుగా లావుగా ఉండే అంజలి ఇటీవల బాగా బ‌క్క‌ చిక్కిపోయింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో రారా రెడ్డి అనే స్పెషల్ సాంగ్‌తో ఊపేసింది. ఇప్పుడు బుల్లితెర షోలలో కూడా బాగా కనిపిస్తోంది.

ఇక తమిళ హీరో జై – అంజలి మధ్య చాలా కాలం పాటు ప్రేమాయణం సాగింది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. చివరిగా బెలూన్ సినిమాలో నటించారు. ఒకే ఇంట్లో అంజలి – జై నాలుగేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే పెళ్లయ్యాక కూడా అంజలి తన కెరీర్ కొనసాగిస్తా అన్న విషయంలో జై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే అంజలితో బ్రేకప్ తర్వాత హీరో జై అడ్రస్ లేకుండా పోయాడు. అంజలి మాత్రం అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ సందడి చేస్తూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news