Moviesమేకప్ టెస్ట్ అని చెప్పి ' ఆమని ' ని గెస్ట్...

మేకప్ టెస్ట్ అని చెప్పి ‘ ఆమని ‘ ని గెస్ట్ హౌస్‌కు పిలిచిందెవ‌రు… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ల‌లో ఆమ‌ని కూడా ఒక‌రు. ఆమ‌ని ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. జంబ‌ల‌క‌డిపంబ‌, శుభ‌ల‌గ్నం, మావిచిగురు, మిస్ట‌ర్ పెళ్లాం, శుభ‌సంక‌ల్పం లాంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి ఆమ‌ని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఈ సినిమాలు అన్నింటిలోనూ గ్లామ‌ర్ కంటే న‌ట‌న‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఉండ‌టంతో ఆమ‌నికి ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియన్స్ లో అభిమానులు ఉన్నారు. ఇలాంటి డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను ఒక్క ఆమ‌ని మాత్రమే చేయ‌గ‌ల‌దు అనుకునేవారు. బాబు లాంటి ద‌గ్గ‌జ ద‌ర్శ‌కులతో ఆమ‌ని సినిమాలు చేయ‌డం గొప్ప‌విష‌యం.

అంతే కాకుండా ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ, కే రాఘ‌వేంద్ర‌రావు లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌ ద‌ర్శ‌క‌త్వంలో ఆమ‌ని సినిమాలు చేశారు. ఆమ‌ని బెంగుళూరులో జ‌న్మించారు. నిజానికి ఆమ‌ని కుటుంబీకులు ఏపీకి చెందిన‌వారే… కానీ ఆమ‌ని తండ్రి బెంగుళూరులో స్థిర‌ప‌డ్డారు. అంతే కాకుండా ఆయ‌న కూడా సినిమాల్లోనే ప‌నిచేశారు. సినిమా ఇండ‌స్ట్రీలో ఆమ‌ని తండ్రి డిస్ట్రిబ్యూట‌ర్ గా ప‌నిచేశారు. ఆమ‌నికి కూడా సినిమాలపై ఉన్న ఆస‌క్తితో చెన్నై వెళ్లి సినిమాల్లో ప్ర‌య‌త్నించింది.

సినిమా ఛాన్సుల కోసం ఎంత ప్ర‌య‌త్నించినా… తండ్రి డిస్ట్రిబ్యూట‌ర్ అయినా సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్ లు అంత సులువుగా రాలేద‌ట‌. కొంత మంది ద‌ర్శ‌కులు ఆమ‌ని ఫోటో స్టిల్స్ చూసి ఒప్పుకుని బ‌య‌ట నేరుగా చూసి రిజెక్ట్ చేసేవార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. అంతే కాకుండా సినిమా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కూడా ఆమ‌ని స్పందించింది. తాను సినిమాల్లో ప్ర‌య‌త్నిస్తున్నప్పుడు ఓ ఆడిష‌న్ కు వెళ్లాన‌ని చెప్పింది. వాళ్లు రేపు గెస్ట్ హౌస్ కు రావాల‌ని చెప్పార‌ని.. అంతే కాకుండా సింగిల్ గా ర‌మ్మన్నార‌ట‌.

వాళ్లు గెస్ట్ హౌస్‌కు రావాలి… సింగిల్‌గా రావాల‌ని చెప్ప‌డంతో త‌న‌కు విష‌యం అర్థం అయ్యింద‌ని చెప్పింది. వాళ్లు కొత్త‌వాళ్లు అని… అప్ప‌టికే సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌వాళ్లు అలా చేయ‌ర‌ని వ్యాఖ్యానించింది. ఇక ప్ర‌స్తుతం ఆమ‌ని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాల్లో పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news