Moviesఅల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్‌కు బ‌లైపోయిన హీరోయిన్లు వీళ్లే...!

అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్‌కు బ‌లైపోయిన హీరోయిన్లు వీళ్లే…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా ఎలా పాపుల‌ర్ అయ్యారో చూశాం. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. పుష్ప దెబ్బ‌తో బ‌న్నీ నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. ఇప్పుడు బ‌న్నీ సినిమా అంటే పాన్ ఇండియా లెవ‌ల్లో అంచ‌నాలు ఉంటున్నాయి. ఇక బ‌న్నీ త‌న ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. అయితే అది ఓ బ్యాడ్ సెంటిమెంట్‌గా మిగిలిపోయింది.

బ‌న్నీ బ్యాడ్ సెంటిమెంటో, ఆ హీరోయిన్ల దుర‌దృష్ట‌మో తెలియ‌దు కాని.. ఆ హీరోయిన్లు ఎవ్వ‌రూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు. మ‌రి బ‌న్నీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ఆ హీరోయిన్లు ఎవ‌రు ? వాళ్లు బ‌న్నీ బ్యాడ్ సెంటిమెంట్ దెబ్బ‌తో ఇండ‌స్ట్రీ నుంచి ఎలా క‌నుమ‌ర‌గ‌య్యారో చూద్దాం.

 

అదితి అగ‌ర్వాల్ :
బ‌న్నీ ఫ‌స్ట్ సినిమా గంగోత్రితో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది దివంగ‌త తార ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లి అదితి అగ‌ర్వాల్‌. ఈ సినిమా హిట్ అయినా.. ఆ త‌ర్వాత రెండు, మూడు సినిమాలు చేసి ఇండ‌స్ట్రీ నుంచి క‌నుమ‌రుగైపోయింది.
గౌరీ ముంజ‌ల్ :
బ‌న్నీ – వివి. వినాయ‌క్ కాంబినేష‌న్లో వ‌చ్చిన బ‌న్నీ సినిమాతో గౌరీ ముంజ‌ల్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగులో గౌరీ సినిమాతో పాటు క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక త్వ‌ర‌గా ఫేడ‌వుడ్ అయిపోయింది.

అనూరాధా మెహ‌తా :
బ‌న్నీ రెండో సినిమా ఆర్య‌తో అనూరాధ మెహ‌తా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెను చూసిన వారు మంచి హీరోయిన్ అవుతుంద‌ని అనుకున్నా ఆ త‌ర్వాత ఒక్క హిట్ లేకుండా అవుట్ అయిపోయింది.
భాను శ్రీ మెహ్రా :
అల్లు అర్జున్ – గుణశేఖర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వ‌రుడు సినిమాతో భాను శ్రీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఆమె నిల‌దొక్కుకోలేదు. అస‌లు ఆ ఒక్క సినిమాతోనే ఆమె అడ్ర‌స్ లేకుండా పోయింది.

షీలా :
అల్లు అర్జున్ ప‌రుగు సినిమాతో షీలా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా చేసింది. అయితే ఆమెకు ఎందుకో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ వ‌చ్చినా నిల‌దొక్కుకోలేక‌పోయింది.
దీక్షా సేథ్‌:
బ‌న్నీ – క్రిష్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన వేదం సినిమాతో దీక్షా సేథ్ ఆ త‌ర్వాత గోపీచంద్‌, మ‌నోజ్ లాంటి హీరోల ప‌క్క‌న న‌టించినా స‌క్సెస్ కాలేదు. అందం ఉన్నా కూడా దీక్ష నిల‌దొక్కుకోలేదు. ఏదేమైనా బ‌న్నీ ఎవ‌రైనా ఓ హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేస్తే ఇండ‌స్ట్రీలో అయితే క‌నీసంగా కూడా నిల‌దొక్కుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news