Moviesశోభిత ధూళిపాళ్ల‌కి ఆ ఇద్దరు హీరోలతో లింక్... లిప్ లాక్ ఇచ్చిన...

శోభిత ధూళిపాళ్ల‌కి ఆ ఇద్దరు హీరోలతో లింక్… లిప్ లాక్ ఇచ్చిన హీరోతో ఫిక్సైపోతుందా..!

శోభితా ధూళిపాళ్ల గురించి ఇటీవల వరుసగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు హీరోలతో ఆమెను ముడుపెడుతూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు గానీ, నెట్టింట మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. శోభితా ధూళిపాళ్ల అచ్చతెలుగమ్మాయి. ఇండియన్ మోడల్ & సినీ నటిగా సౌత్‌లో బాగానే పాపులర్ అయింది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కీలక పాత్రలను పోషిస్తోంది.

 

ముఖ్యంగా టాలీవుడ్ టాలెండ్ హీరో అడివి శేష్ నటించిన సినిమాలలో ముఖ్య పాత్రలను పోషించి బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ హీరోతో పెదవులు కలపడం కూడా హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, శోభితా ధూళిపాళ్ల – అడివి శేష్‌ల మధ్య ఏదో విడదీయరాని బంధం ఉందని ..డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇదే కాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు షికార్లు చేశాయి.

అడివి శేష్, శోభితా ధూళిపాళ్ల కలిసి గూఢాచారి ఇటీవల వచ్చిన మేజర్ చిత్రాలలో నటించారు. ఇది కూడా ఓ కారణం. వీరు పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు పుట్టడానికి..! ఇదిలా ఉంటే, నాగ చైతన్య సమంతతో విడిపోయాక సన్నిహితంగా ఉంటుంది శోభితా ధూళిపాళ్లతో అని ఈ మధ్య వార్తలు వచ్చి నెట్టింట వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి ఒకే హోటల్ రూంలో ఉన్నారని మీడియా కంట కూడా పడ్డారని న్యూస్ స్ప్రెడ్ అయింది.

అంతేకాదు, ఈ మధ్య కొన్ని ఫంక్షన్లకి నాగ చైతన్య – శోభితా ధూళిపాళ్ల కలిసి అటెండ్ అవుతున్నారని చైతూ పెళ్ళి చేసుకోబోయేది శోభితా ధూళిపాళ్లనే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు చైతూ ఇటు శోభితా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వార్తలకి మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. మొత్తానికి శోభితా ధూళిపాళ్ల నాగ చైతన్యను పెళ్లి చేసుకునే అవకాశాలం కంటే అడివి శేష్‌తో జీవించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. చూడాలి మరి నిజం నిప్పులా ఎప్పుడు బయటకి వస్తుందో..!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news