Moviesఆ ఇద్ద‌రి అండ చూసుకునే టాలీవుడ్‌లో పూజా హెగ్డే త‌ల పొగ‌రు...

ఆ ఇద్ద‌రి అండ చూసుకునే టాలీవుడ్‌లో పూజా హెగ్డే త‌ల పొగ‌రు చూపిస్తోందా…!

సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా ఒక హీరోయిన్ స్టార్‌గా మారాలంటే దర్శకుడి అండదండలు గానీ, నిర్మాత సపోర్ట్ గానీ, హీరో సపోర్ట్ గానీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా అయితే హీరోయిన్స్ సక్సెస్ అవుతారు. లేదంటే కష్టమే. కెరీర్ ప్రారంభంలో ఫ్లాప్స్ వచ్చినా వెనకుండి నడింపించే దర్శక నిర్మాతలుంటే అందరూ పూజా హెగ్డే మాదిరిగానే స్టార్ హీరోయిన్స్‌గా మారిపోతారు. తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఒకేసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే, ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ సాధించలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సినిమా మొహంజాదారో సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రాగానే ఇక టాలీవుడ్‌లో మనకి పనేం లేదని ముంబై ఫ్లైటెక్కేసింది. హిందీలో మొహంజాదారో సినిమా కోసం రెండేళ్ళు బాగా శ్రమించింది. అయితే, తీరా చూస్తే సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అస‌లు ఈ సినిమా ఎందుకు చేశానురా ? బాబు అని ఆమె త‌ల‌లు ప‌ట్టుకునే వ‌ర‌కు వ‌చ్చింది.

ఇలా తెలుగులో చేసిన రెండు సినిమాలు హిందీలో చేసిన ఒక సినిమా అంతకముందే తమిళంలో చేసిన ఒక సినిమా ఫ్లాపయ్యేసరికి పూజా హీరోయిన్‌గా పనికిరాదని ఫిక్సైపోయింది. కానీ, తనలో మంచి పర్ఫార్మర్ ఉన్నారనే విషయం దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు పసిగట్టారు. దాంతో దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. అయినా దిల్ రాజును గట్టిగా పట్టుకుంది.

మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మహర్షి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవడం పూజాకి టర్నింగ్ పాయింట్. అక్కడ్నుంచి త్రివిక్రమ్‌ అమ్మడికి అవకాశాలిస్తూ హిట్స్ ఇస్తూ స్టార్ హీరోయిన్‌గా మార్చారు. మధ్యలో హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా అవసరం లేకపోయినా పూజానే తీసుకున్నారు. అలా అటు హరీష్ శంకర్, ఇటు త్రివిక్రమ్‌..దిల్ రాజు పూజాకు సపోర్ట్ చేస్తూ పైకి లేపారు.

త్రివిక్ర‌మ్ అయితే త‌న మూడు సినిమాల్లో వ‌రుస‌గా ఆమెనే హీరోయిన్‌గా కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నాడు. అల వైకుంఠ‌పురంలో, అర‌వింద‌స‌మేత వీర‌రాఘ‌వ‌.. ఇప్పుడు తాజాగా మ‌హేష్‌బాబు సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద ఫ్లాప్స్ వడుతున్నా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఇక తెలుగులో అయితే ర‌ష్మిక రాబ‌ట్టి కాస్త పోటీ ఉంది కాని.. లేక‌పోతే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఆమె ఆడింది ఆట పాడింది పాట‌గా మారింది. అందుకే ఆమె త‌ల‌పొగ‌రు యాట్యిట్యూడ్ చూపిస్తుంద‌న్న కామెంట్లు కూడా ఉన్నాయి.

Latest news