Moviesలైగర్ మూవీ రిలీజ్..ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేసిన రష్మిక..క్షణాల్లో వైరల్..!!

లైగర్ మూవీ రిలీజ్..ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేసిన రష్మిక..క్షణాల్లో వైరల్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూస్తున్న ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించారు . కొద్ది గంటల క్రితమే ఈ సినిమా షో బొమ్మ పడింది. ముందు నుంచి అంచనాలు ఎలా ఉన్నా ..ఆ బొమ్మ పడ్డాక మాత్రం సినిమా యావరేజ్ గా నిలిచింది. కొందరు సినిమా హిట్ అంటున్నారు.. కొందరు సినిమా ఫ్లాప్ అంటున్నారు. కానీ ఎక్కువ శాతం జనాలు సినిమా బాగాలేదని చెప్తున్నారు.

ఈ సినిమాలో పూరి డైరెక్షన్ మార్క్ లేదని.. విజయ్ నటన పరంగా మెప్పించిన పూరి డైరెక్షన్ ఫ్లాప్ గా నిలిచిందని ..సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటి అనేది డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్లియర్ గా చూపించలేదని జనాలు చెప్తున్నారు. అయితే లైగర్ మూవీ రిలీజ్ టాక్ ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ రష్మిక షేర్ చేసిన ఫోటోల పైనే ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో బాగా వైరల్ గా మారింది హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన లవ్ చేసుకుంటున్నారని. వాళ్ల కెరియర్ లో సెటిల్ అవ్వగానే పెళ్లి చేసుకోబోతున్నారని తెగ హల్చల్ చేస్తుంది. దీనిపై ఇప్పటికి ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చినా.. కాని వాళ్ళ బిహేవియర్.. వాళ్ళ పద్ధతులు కారణంగా ఆ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. కచ్చితంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ అనుకుంటున్నారు.

అయితే స్టార్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్ అయిన ప్రజెంట్ ఇప్పుడు అందరి దృష్టి రష్మిక షేర్ చేసిన ఫోటోలు పైనే ఉంది . ఇప్పటివరకు తనని ఎన్నడు చూడని లుక్స్ లో రష్మిక దిగిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడం అభిమానులకు ఆనందాన్నిస్తుంది. ఈ ఫొటోలలో రష్మిక స్టన్నింగ్స్ లుక్స్ లో అదరగొట్టేసింది. చాలా హోమ్లీగా నో మేకప్ నో ఫిల్టర్ తో రష్మిక బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది . రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో రష్మిక త న లుక్స్ తో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది. చేతుల్లో కాఫీ కప్ పట్టుకొని కిటికీలో నుంచి సూర్యకిరణాలు ఆమె ఫేస్ పై పడుతూ ఉన్న ఫోటో అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. దీంతో రష్మిక షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news