Moviesఎందుకో తెలియదు..ఇన్నేళ్లు అయిన ఇప్పటికి ఆ పని చేయలేకపోతున్న..సంచలన విషయాని బయటపెట్టిన...

ఎందుకో తెలియదు..ఇన్నేళ్లు అయిన ఇప్పటికి ఆ పని చేయలేకపోతున్న..సంచలన విషయాని బయటపెట్టిన రమ్య !!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. రమ్యకృష్ణ స్థానం ఎవ్వరు ఫిల్ చేయలేరనే చెప్పాలి. ఆ నటన, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ గంభీరం.. ఆ మాస్ యాంగిల్స్.. రమ్యకృష్ణ లో తప్పిస్తే మరొకరిలో లేవు అని అంటున్నారు అభిమానులు. ఆఫ్ కోర్స్ రమ్యకృష్ణ నటన గురించి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నీలాంబరిగా అయిన ఓ శివగామిగా అయిన ఆమె తర్వాతే ఎవరైనా. దర్శకధీరుడు రాజమౌళి సైతం రమ్యకృష్ణ గారి నటనకు ఫిదా అయ్యారంటే ఆమె ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.

అప్పట్లో రమ్యకృష్ణ తెరపై కనిపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోయే వాళ్ళు. తెలుగు – తమిళ – హిందీలో సినిమాలు చేస్తూ మూడు ఇండస్ట్రీలల్లో భారీ స్థాయిలో పాపులారిటి దక్కించుకుంది. ఎందుకు తెలియదు హిందీలో ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ గా కనిపించింది. కానీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అంతెందుకు నిన్న కాక మొన్న వచ్చిన లైగర్ సినిమాలో కూడా రమ్యకృష్ణ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. హీరో విజయ్ దేవరకొండ తర్వాత ఆ సినిమాలో హైలెట్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది రమ్యకృష్ణ దే.

కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన గతం తాలూకా విషయాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హిందీ సినిమాల రిజల్ట్ గురించి ప్రస్తావించారు. ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ..” తెలుగు తమిళంలో నేను పెద్ద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను. రీజన్ ఏంటో తెలియదు కానీ హిందీలో ఆఫర్లు వచ్చిన హిట్ కొట్టలేకపోయాను. ఆ తర్వాత కూడా నాకు హిందీలో ఆఫర్లు వచ్చాయి.

కానీ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆ టైంలో ఇండస్ట్రీని వదిలి హిందీలో సినిమాలు చేయడానికి మనసు రాలేదు. తెలుగు తమిళ ఇండస్ట్రీని వదిలిపెట్టి హిందీలో సూపర్ హిట్ కోసం పోరాటం చేసేందుకు నాకు ధైర్యం చాలలేదు. ఇక్కడే ఇంకా ఏదో సాధించాలి అని అనిపించింది. ఇప్పటికే నాకు హిందీలో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. తెలుగు తమిళ భాషల్లోని సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాను . అన్నింటిని వదులుకొని హిందీ కోసం ధైర్యం చేయలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. రమ్యకృష్ణ హిందీలో ..”దయావన్ ,పరంపర .కల్నాయక్ ,బనారసి బాబు .బడే మీయ చోటే మీయ”.. వంటి చిత్రాలలో నటించారు. కానీ ఈ సినిమాలు ఏవి ఆకట్టుకోలేకపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news