Moviesఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్‌.. ఆస్కార్ బ‌రిలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌...!

ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్‌.. ఆస్కార్ బ‌రిలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌…!

ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది. అలాంటి ఎన్టీఆర్ పేరుతో పాటు ఆయన నటనను కూడా అందిపుచ్చుకొని తాత పేరు నిలబెడుతున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తారక్‌ నటన గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం త్రిబుల్ ఆర్ సినిమాకు ముందు… త్రిబుల్ ఆర్ సినిమాకు తర్వాత అని చెప్పుకోవాలి. తెలుగులో ఎన్టీఆర్ ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చినా త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగిపోయాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో చేసిన నటనకు భారతీయ సినిమా ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇటు సౌత్ ఇండియాతో పాటు అటు నార్త్ లో కూడా ఎన్టీఆర్ నటన అద్భుతం అని అందరూ ప్రశంసించారు. రౌద్రం – ప్రేమ – కరుణరసం – బీభత్సం ఇలా అన్నీ ఒకే పాత్రలో చూపించి ది బెస్ట్ నటనతో ప్రేక్షకులను మైమరిపింపచేశాడు.

ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పులేదని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసే న్యూస్ వచ్చేసింది. ఈసారి ఆస్కార్ బ‌రిలో త్రిబుల్ ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్‌ను ఉత్తమ నటుడు కేటగిరీలో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ మూవీ ప‌బ్లికేష‌న్ వెరైటీ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఆస్కార్ 2023 బ‌రిలో ఎన్టీఆర్ ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వార్తే నిజం అయితే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి అస్కార్ అవార్డుకు ఎంపికైన హీరో ఎన్టీఆర్ ఒక్క‌డే ఉంటాడు. ఇది నిజంగా టాలీవుడ్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం అని చెప్పాలి. ఇప్పుడు ఈ విష‌యం ఇండియా వైడ్‌గా మార్మోగిపోతోంది. సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు మాత్ర‌మే కాదు.. ప్ర‌తి తెలుగు సినిమా అభిమాని ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news