Moviesఉద‌య్ కిర‌ణ్ - ఆర్తీ అగ‌ర్వాల్ స్నేహంలో ఇంత దుర‌దృష్టం ఉందా...!

ఉద‌య్ కిర‌ణ్ – ఆర్తీ అగ‌ర్వాల్ స్నేహంలో ఇంత దుర‌దృష్టం ఉందా…!

టాలీవుడ్ లో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్, దివంగత యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఆత్మ‌హ‌త్య‌లు చీకటి విషాదాంతాలు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు చిన్నవయసులోనే అకాల మరణం పాలవటం సినిమా వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. దాదాపు ఒకే టైంలో కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు నాలుగైదు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్లు అయిపోయారు. చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ డూపర్ హిట్లతో అప్పట్లో స్టార్ హీరోల‌కు ముచ్చెమటలు పట్టించాడు.

ఇటు వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆర్తి అగర్వాల్ నాలుగు సంవత్సరాలలో టాలీవుడ్ ను మొత్తం ఒక ఊపు ఊపేసింది. వరుసగా అటు సీనియర్ హీరోలు బాలయ్య – నాగార్జున – వెంకటేష్ – చిరంజీవితో పాటు క్రేజీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ పక్కన కూడా నటించింది. అస‌లు అప్ప‌ట్లో ఆర్తీ అందానికి తెలుగు జ‌నాలు ఫిదా అయిపోయారు.

సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి… నిజ జీవితంలో తక్కువ వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన వీరిద్దరూ మంచి స్నేహితులు. ఉదయ్ – ఆర్తి కాంబినేషన్లో పరుచూరి మురళి దర్శకత్వంలో నీ స్నేహం సినిమా వచ్చింది. అప్పట్లో వీరిద్దరూ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో పాటు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నీ స్నేహం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై ఎమ్మెస్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

ఇద్దరు స్నేహితుల స్నేహం అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్పీ పట్నాయక్ అందించిన స్వరాలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. సీనియర్ నటులు కే విశ్వనాధ్ – గిరిబాబు – శివాజీ రాజా – పరుచూరి వెంకటేశ్వరరావు – ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆర్తి – ఉదయ్ మంచి స్నేహితులు అయ్యారు. అయితే అప్పటికే ఆర్తికి మరో యంగ్ హీరో తరుణ్ తో ఎఫైర్ ఉందన్న వార్తలు వచ్చాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్త‌రు హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా ఉదయ్ – ఆర్తి మంచి స్నేహితులగానే కొనసాగారు. దురదృష్టవ‌శాత్తు ఆ తర్వాత ఇద్దరికీ కెరీర్ పరంగా డౌన్‌ఫాల్ స్టార్ట్ అవడంతో పాటు హిట్ సినిమాలు రాలేదు. అటు ఉదయ్ కిరణ్ కు చిరంజీవి కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగి క్యాన్సిల్ అవ్వటం… ఇటు తరుణ్‌తో ఆర్తి అగర్వాల్ ప్రేమ బ్రేకప్ అవడంతో ఈ ఇద్దరికి పెద్ద దెబ్బ పడిపోయింది. చివ‌ర‌కు వారు చిన్న వ‌య‌స్సులోనే మృతిచెంద‌డం మ‌రింత బాధాకరం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news