Moviesతార‌క్ బ్లాక్‌బ‌స్ట‌ర్ల వెన‌క న‌ట‌సింహం బాల‌య్య‌... ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

తార‌క్ బ్లాక్‌బ‌స్ట‌ర్ల వెన‌క న‌ట‌సింహం బాల‌య్య‌… ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

నందమూరి బాలకృష్ణ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తే అదిరిపోతుందని నందమూరి అభిమానులు గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ కాంబినేషన్లో సినిమా కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. సగటు తెలుగు సినిమా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నాడు. బాలయ్య – తారక్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రేజీ ప్రాజెక్టు పై బాలయ్య లేదా తారకలో ఎవరో ఒకరు డేరింగ్ స్టెప్ వేస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ ఇద్దరు హీరోలు ఓకే చెప్పాలే కానీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం వీరితో సినిమా చేసేందుకు రెడీగా ఉంటారు.

కలలో కూడా ఊహించని ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్‌ను దర్శకధీరుడు రాజమౌళి సెట్ చేసి పాన్‌ ఇండియా వైస్ గా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇలాంట‌ప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ – బాలయ్య మల్టీస్టారర్ అనుకుంటే తెరకెక్కించటం పెద్ద కష్టం కాదు. ఎన్టీఆర్‌కు కెరీర్ స్టార్టింగ్‌లో స్టార్‌డ‌మ్ తెచ్చిన‌ రెండు సినిమాలు ప‌రోక్షంగా బాల‌య్య వ‌ల్లే హిట్ అయ్యాయి.

వివి. వినాయ‌క్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆది సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ముందుగా వినాయక్ తారక్ తో లవ్ స్టోరీ తరికెక్కించాలని అనుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్ రావాలన్న కోరిక‌తో ఉన్న కొడాలి నాని ఆ లవ్ స్టోరీ ని రిజెక్ట్ చేశాడు. దీంతో బాలయ్య కోసం తయారుచేసిన రెండు సీన్లను కథగా అల్లి వినాయక్ తారక్‌కు చెప్పి ఒప్పించారు. అలా ఆది సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా వినాయక్‌.. బాలయ్య కోసం తయారుచేసిన కథలో తారక నటించి సూపర్ హిట్ కొట్టాడు.

ఇక ఆ తర్వాత బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్లో సింహాద్రి సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. రచయిత విజయేంద్రప్రసాద్ సింహాద్రి కథను రెడీ చేసి బిగోపాల్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందిస్తే హిట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఈ కథ తాను గతంలో నటించిన కథలతో పోలి ఉండటంతో బాల‌య్య‌ నో చెప్పారు. ఆ తర్వాత రాజమౌళి ఇదే కథను తారక్ తో సింహాద్రి సినిమాగా తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అలా తారక్ కెరీర్ ఆరంభంలో నటించిన ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ల వెనక పరోక్షంగా బాలయ్య ఉన్నారని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news