Movies' లైగ‌ర్ ' కోసం బాల‌య్య సంద‌డి చూశారా... ( వీడియో)

‘ లైగ‌ర్ ‘ కోసం బాల‌య్య సంద‌డి చూశారా… ( వీడియో)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ఈ రోజు భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప్రీమియ‌ర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీగా వ‌చ్చిన లైగ‌ర్‌కు సాలా క్రాస్ బీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. పూరి జ‌గ‌న్నాథ్ త‌న పూరి క‌నెక్ట్స్ సంస్థ‌తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి స్వ‌యంగా నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక లైగ‌ర్‌లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది.

ఇక సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ విజ‌య్‌కు త‌ల్లిగా న‌టించ‌గా… ఒక‌ప్ప‌టి ప్ర‌పంచ బాక్సింగ్ కింగ్ మైక్‌టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. మాస్‌, యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా తెర‌కెక్కింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఈ సినిమా యూనిట్ లైగ‌ర్ కోసం ఏకంగా రెండున్న‌ర సంవ‌త్స‌రాల పాటు క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా రిలీజ్ కోసం టాలీవుడ్ సెల‌బ్రిటీలు అంద‌రూ సోష‌ల్ మీడియాలో త‌మ వంతుగా ప్ర‌మోషన్లు చేశారు.

సినిమా విజ‌యం సాధించాల‌ని త‌మ వంతుగా శుభాకాంక్ష‌లు చెప్పారు. ఇక ఈ సినిమా కోసం బాలయ్య సైతం ఆస‌క్తిగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ న‌డుస్తున్న‌ప్పుడు బాల‌య్య షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మ‌రీ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. బాల‌య్య – పూరి మ‌ధ్య ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. వీరిద్ద‌రి కాంబోలో పైసా వ‌సూల్ సినిమా వ‌చ్చింది.

ఆ సినిమాలో త‌న మేకోవ‌ర్ బాల‌య్య‌కు బాగా న‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా తాను పూరితో క‌లిసి మ‌రో సినిమా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఈ అనుబంధంతోనే పూరి తాజా సినిమా లైగ‌ర్ యూనిట్‌తో బాల‌య్య సంద‌డి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పూరి షేర్ చేశాడు. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news