Movies' లైగ‌ర్ ' ప్లాప్ టాక్‌... భోరున ఏడ్చేసిన ఛార్మీ... అస‌లేం...

‘ లైగ‌ర్ ‘ ప్లాప్ టాక్‌… భోరున ఏడ్చేసిన ఛార్మీ… అస‌లేం జ‌రిగింది…!

లైగ‌ర్ సినిమాకు యునాన‌మ‌స్‌గా ప్లాప్ టాక్ అయితే వ‌చ్చేసింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అయితే ఈ సినిమాకు దారుణ‌మైన నెగ‌టివ్ టాక్ రావ‌డంతో సోష‌ల్ మీడియాలో పూరిని ఏకేస్తున్నారు. విజ‌య్ క‌ష్టాన్ని మెచ్చుకుంటున్న వారు అంద‌రూ పూరీనే బాగా టార్గెట్ చేస్తున్నారు. పులి దాడి ఒక‌లా ఉంటుంది.. సింహం వేట మ‌రోలా ఉంటుంది. రెండు క‌లిసి ఒకేసారి దాడి చేస్తే లైగ‌ర్‌లా ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ దాడి దెబ్బ‌తో ఒళ్లంతా గాయాలు చేసుకుని సినిమా థియేట‌ర్ నుంచి ఇళ్లు చేరితే అప్ప‌టికే లైగ‌ర్ ర‌క్త బాధితులు త‌మ గాయాల‌తో ఫేస్‌బుక్‌లో కిట‌కిట‌లాడుతున్నార‌ని ఘోరంగా సెటైర్లు వేశాడు ఓ నెటిజ‌న్‌. అస‌లు ఈ సినిమాను ఇంత ఓవ‌ర్‌గా ప్ర‌మోష‌న్ చేసిన‌ప్పుడే ఏదో డౌట్ కొడుతుంద‌న్న సందేహాలు వ‌చ్చాయ‌ని కొంద‌రు అంటున్నారు. ఇక మ‌రి కొంద‌రు అయితే ప్ర‌మోషన్ల‌లో ఛార్మీ ఏడుస్తున్న‌ప్పుడే సినిమా రిజ‌ల్ట్ ఏంటో ముందే ఆమెకు అర్థ‌మై సెంటిమెంట్ క‌న్నీళ్ల‌కు అయినా నాలుగు టిక్కెట్లు తెగ‌వా.. నాలుగు డ‌బ్బులు రాల‌వా ? అన్న ఎంటిమెంట్ గేమ్ ప్లే చేసింద‌ని అంటున్నారు.

థియేట‌ర్లో సినిమా చూస్తున్న‌ప్పుడు విజ‌య్ విసిరే పంచ్‌లు సినిమా చూసే ప్రేక్ష‌కుడికి త‌గిలిన‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు సెటైర్ వేశారు. అస‌లు సినిమాలో విల‌న్లు లేక‌పోవ‌డం మైన‌స్ అంటున్నారు. క‌థ‌లో ద‌మ్ము లేక‌పోతే అమీర్‌ఖాన్, అక్ష‌య్‌కుమార్ సినిమాలే చీదుతున్నాయి. పూరికి త‌న‌కు తాను పెద్ద తోపు అన్న న‌మ్మ‌కం. అయితే అది గ‌తంలో.. ఈ రోజు నువ్వు ఏంట‌న్న‌దే ఇప్పుడు కొల‌మానం.

పూరి అస‌లైన బాక్స‌న్ క‌థ‌ను వ‌దిలేసి.. అందులోకి ప్రేమ‌క‌థ‌ను జోడించి న‌త్తి, సుత్తి అంటూ చెప్ప‌డంతో ప్రేక్ష‌కులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. పూరి రైటింగ్ మీద క‌నీస శ్ర‌ద్ధ కూడా పెట్ట‌లేద‌నే అంటున్నారు. అన్న‌ట్టు మ‌రో విష‌యం కొంద‌రు నెటిజ‌న్లు అయితే పూరి ఇప్ప‌ట‌కీ అయినా పైకి రావాలంటే నీ ప‌క్క‌నే ఉన్న ఛార్మీని ప‌క్క‌న పెట్టక‌పోతే నిన్ను టాలీవుడ్‌, సినీ జ‌నాలు మ‌ర్చిపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news