Moviesకాజల్ రీఎంట్రీ అప్డేట్ వచ్చేసిందోచ్..ఆ సినిమాతోనే...అఫిషీయల్ గా ప్రకటించిన చందమామ..!!

కాజల్ రీఎంట్రీ అప్డేట్ వచ్చేసిందోచ్..ఆ సినిమాతోనే…అఫిషీయల్ గా ప్రకటించిన చందమామ..!!

టాలివుడ్ చందమామ ఎవరు అంటే టక్కున గుర్తు వచ్చే పేరు కాజల్ అగర్వాల్..చందమామ కన్న ఫేస్ గ్లో గా మెరిసి పోతుంటుంది. కాజల్ కు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న మాట వస్తవమే కానీ..అమతకన్న సెలబ్రిటీలకు కూడా ఈ అమ్మడు అంటే చాలా ఇష్టం. బిగ్ స్టార్స్ కూడా ఈమెతో నటించడానికి ఇష్టపడుతుంటారు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ బ్యూటీ..ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటి..ఎంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుందో అంతే ఫాస్ట్ గా పిల్లాడిని కూడా కనేసింది. ప్రెగ్నేన్సీ టీం లో కాజల్ బాడి లోను మార్పులు చూసి,,ఇంక హీరోయిన్ గా పనికి రాదు అనుకున్నారు. హ్యూజ్ ట్రోలింగ్ చేసారు. కానీ, డెలివరి తరువాత కాజల్ లో చాలా ఛేంజస్ వచ్చాయి. ఫుడ్ డైట్ ఫాలో అవుతూ..పలు వ్యాయామాలు చేస్తూ..బాడీ చక్కటి షేప్ లోకి తెచ్చుకుంది.

అయితే, కాజల్ రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఈ బ్యూటీ గుడ్ న్యూస్ అందించింది. రీసెంట్ గా ఇన్స్టా లో అభిమానులతో ముచ్చటించిన కాజల్..తన రీ ఎంట్రీని కన్ ఫామ్ చేసింది. కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2′ సినిమా గురించి అఫీషీయల్ గా ప్రకటించింది కాజల్. ఇండియన్ 2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి షురూ కానుందని కాజల్ అగర్వాల్ అభిమానులతో చెప్పుకొచ్చింది. దీనితో ప్రెగ్నెన్సీ తర్వాత చందమామ రీ ఎంట్రీ ఫిక్స్ అయింది. కాగా విక్రమ్ తర్వాత కమల్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అగ్ర దర్శకుడు శంకర్ కి, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాతలకు తలెత్తిన విభేదాల కారణంగా ‘ఇండియన్ 2’ చిత్రం మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news