Moviesక‌ళ్యాణ్‌రామ్ 3 హిట్ సినిమాల్లో ఈ కామ‌న్ పాయింట్ గ‌మ‌నించారా... భ‌లే...

క‌ళ్యాణ్‌రామ్ 3 హిట్ సినిమాల్లో ఈ కామ‌న్ పాయింట్ గ‌మ‌నించారా… భ‌లే ట్విస్టింగ్‌గా ఉందే..!

నందమూరి ఫ్యామిలీ హీరోల వరుస హిట్లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. గత ఎనిమిది నెలల కాలంలో నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీని కాపాడాయి. ముందుగా బాలయ్య అఖండ, ఆ తర్వాత ఎన్టీఆర్ RRR.. ఇప్పుడు తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార‌ సినిమాలు మంచి హిట్ అవడంతో పాటు థియేటర్లో కళకళలాడేలా చేశాయి. ఇక బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్‌కు పటాస్ తర్వాత అంతకు మించిన కెరీర్ బ్లాక్ బస్టర్ దక్కింది.

బింబిసార సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రు. 22 కోట్లకు పైగా షేర్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమా ఫైనల్ ర‌న్‌లో రు. 30 కోట్ల షేర్ రాబ‌ట్టి కళ్యాణ్‌రామ్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు.. ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లో పటాస్, అతనొక్కడే, బింబిసార‌ సినిమాలు మూడు హిట్ అయ్యాయి. మ‌ధ్య‌లో థ్రిల్ల‌ర్ మూవీగా వ‌చ్చిన 118 సినిమా కూడా హిట్ అయ్యింది.

ఇక పటాస్‌, అత‌నొక్క‌డే, బింబిసార సినిమాల విష‌యానికి వస్తే ఈ మూడు సినిమాల్లో ఓ కామ‌న్ పాయింట్ సినిమాల విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పటాస్ లో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో క‌నిపించాడు. ఆ త‌ర్వాత ఆ పాత్రే పోలీస్‌గా మారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక అత‌నొక్క‌డే సినిమాలో కూడా ముందుగా త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకునేందుకు హీరో పాత్ర నెగ‌టివ్‌గా ఉంటుంది.

త‌ర్వాత అత‌డు అలా ఎందుకు మారాడు ? అన్న‌ది తెలిశాక క‌థ‌లో ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఈ సినిమా విజ‌యంలో ఇది కీల‌క‌మైంది. ఇక బింబిసార సినిమాలో కూడా ముందు క్రూర‌మైన రాజుగా క‌ళ్యాణ్‌రామ్ ద‌ర్శ‌న‌మిస్తాడు. ఆ త‌ర్వాత అహంభావంతో ఉన్న అత‌డి జీవితంలో జ‌రిగిన మార్పుల వ‌ల్ల అత‌డి జీవితం ఊహించ‌ని విధంగా త‌ల్ల‌కిందులు అయ్యి అత‌డు ప‌రివ‌ర్త‌న చెందుతాడు.

అలా నెగ‌టివ్ పాత్ర‌లు క‌ళ్యాణ్‌రామ్‌కు బాగా క‌లిసి వ‌స్తున్న‌ట్టే ఉంది. ఇక బింబిసార‌తో హిట్ కొట్టిన క‌ళ్యాణ్‌రామ్ రాబోయే మూవీ డెవిల్ పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news