Movies‘సీతారామం’ పబ్లిక్ టాక్: ఆ ఒక్క మార్పు సినిమా రిజల్ట్ నే...

‘సీతారామం’ పబ్లిక్ టాక్: ఆ ఒక్క మార్పు సినిమా రిజల్ట్ నే తారుమారు చేసేసింది..తప్పు చేసావ్ రాఘవ..?

మహానటి సినిమా తో తన కంటూ సోషల్ గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్‌ సల్మాన్‌ నేరుగా తెలుగులో నటిస్తున్న మరో చిత్రం ‘సీతారామం’. మొదటి నుండి ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే ఉన్నాయి టీజర్ అండ్ ఫస్ట్ లుక్స్..ట్రైలర్. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ కూడా ..ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పడం..డైరెక్టర్ ను ఓ రేంజ్ లో పొగిడేయటం తో సినిమా పై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు జనాలు. కానీ, సినిమా ధియేటర్ లో రిలీజ్ అయ్యాక పరిస్ధితి మరో లా ఉంది.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయ్యింది. సినిమా స్టోరీ పాతదే అయినా..కొత్తగా చూయించాదూ డైరెక్టర్.ఈ సినిమాకి డైరెక్టర్ గా వర్క్ చేసిన హను రాఘవపూడి గత సినిమాలు కూడా అలాగే ఉంటాయి. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇది ఓ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామా అని డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చారు. రష్మిక మందాన ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించడం మరో విశేషం. ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది.

అయితే, సినిమాలో ముందు నుండి ఎక్స్ పెక్ట్ చేసిన అంశాలు కొన్ని మిస్ అయ్యాయి. సినిమా మొత్తం రష్మిక నే కనిపిస్తుంది. కానీ, అమ్మడు పాత్ర జనాలకి ఎక్కలేదు. పేరుకే మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ ..కానీ స్క్రీన్ స్పెస్ అంతా రష్మిక నే కనిపిస్తుంది. దుల్కర్‌ సల్మాన్‌ తన నటనతో మెప్పించిన..సినిమా కధ స్లోగా సాగడంతో ..జనాలకు విసుకు తెప్పించాడు డైరెక్టర్. ఇదే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటున్నారు జనాలు. సాఫీగా సాగిపోతున్న కధలోకి అనవసరపు క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి..కధ ను తప్పు దారి పట్టించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికి..సినిమా స్లో గా సాగే టైంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రొమాన్స్ టైంలో న్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. మొత్తానికి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద యావరేజ్ గా నిలిచింది అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news