Moviesఅందుకు ఒప్పుకోలేద‌ని మాధ‌వీల‌త‌ను టార్చ‌ర్ పెట్టి.. అవ‌కాశాల్లేకుండా చేసిన డైరెక్ట‌ర్ ఎవ‌రు..!

అందుకు ఒప్పుకోలేద‌ని మాధ‌వీల‌త‌ను టార్చ‌ర్ పెట్టి.. అవ‌కాశాల్లేకుండా చేసిన డైరెక్ట‌ర్ ఎవ‌రు..!

మన తెలుగమ్మాయిలకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువని వాపోతున్న వారు చాలామందే ఉన్నారు. ఇది నిజం అని ఒప్పుకోవచ్చు కూడా. ప్రత్యక్షంగానూ ఎన్నో ఉదాహరణలు కళ్ళముందు కనపడుతున్నాయి. ముంబై హీరోయిన్స్ చేసినట్టుగా ఎక్స్‌ఫోజింగ్ మన తెలుగమ్మాయిలు చేయరనే ఓ అపవాదు ఎప్పుడూ వినిపిస్తుంది. ఇది మేకర్స్ నుంచి. అదే హీరోయిన్స్‌గా స్టార్ స్టేటస్ ని అందుకోవాల్సిన మాధవీ లత లాంటి అమ్మాయిల వాదన మరోలా ఉంది.

నటుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా నచ్చావులే. ఈ సినిమాలో తనీష్ హీరోగా నటించాడు. ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకు రామోజీరావు నిర్మాత. యూత్ అండ్ ఫ్యామిలీ కథాంశంతో వచ్చిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమా సమయంలో మాదవీలత దర్శకుడి తీరు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొందని గతంలో పలుమార్లు చెప్పుకొచ్చిది. బళ్ళారి నుంచి వచ్చిన ఈ అమ్మాయికి సినిమా ప్రారంభం సమయంలో చూసినట్టుగా ఆ తర్వాత చూడలేదని వాపోయింది.

ద‌ర్శ‌కుడు చెప్పినట్టు వినని కారణంగా కొన్ని బూతులు తిట్టినట్టుగానూ మాధవీ లత వెల్లడించిది. చెట్ల కింద కూర్చోబెట్టి అవమానించారని… ఇదంతా దర్శకుడు చెప్పినట్టు విననందుకే అని ఆవేదనని వ్యక్తం చేసింది. ఇక తెలుగమ్మాయిలు ఎక్స్‌ఫోజింగ్ చేయ‌రని అంటుంటారు. నేను స్నేహితుడా సినిమాలో చేసింది ఏంటి.. ఎక్స్‌ఫోజింగ్ కాదా ? అది గ్లామర్ రోల్ కాదా. కథ ఏది అవసరమో అది ఇవ్వడానికి తెలుగమ్మాయిలు కూడా రెడీగానే ఉంటారు.

 

కానీ, వారికి కావాల్సింది ఇంకేదో. అది అందరు అమ్మాయిలు మనసు చంపుకొని ఇవ్వలేరు. అందుకే నాలాంటి చాలామంది అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకొచ్చి ఇక్కడున్న మనుషులు వారి అవసరాలు చూసి నోట మాట రావడలేదని చెప్పుకొచ్చింది. తెలుగమ్మాయిలకి అవకాశాలిస్తే మాకేంటీ..? అనేది వారిలో ముఖంలో కనిపిస్తుంది. అది ఏంటో మనమే అర్థం చేసుకొని కమిటవ్వాలి. అప్పుడు నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే తొక్కేస్తారు అని చెప్పుకొచ్చింది.

ఇక ఇప్ప‌టికే ఫేడ‌వుట్ అయిన మాధ‌వీల‌త రాజ‌కీయాల్లోకి కూడా వ‌చ్చింది. బీజేపీలో చేరిన ఆమె ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసింది. ఇక ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తోనూ, ఇటు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్
వ్యాఖ్య‌ల‌తోనూ లైమ్‌లైట్‌లో ఉండేందుకు ట్రై చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news