Moviesస్టార్ హీరోయిన్ ' ఆర్తి అగర్వాల్ ' ఎందుకు విషం తాగింది......

స్టార్ హీరోయిన్ ‘ ఆర్తి అగర్వాల్ ‘ ఎందుకు విషం తాగింది… ఆ హీరో వ‌ల్ల ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ లో కొంత‌మంది తార‌లు చిన్న వ‌య‌సులోనే ర‌క‌ర‌కాల కార‌ణాలతో మ‌ర‌ణించి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను.. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ లిస్ట్ లో అందాలతార ఆర్తి అగ‌ర్వాల్ కూడా ఒక‌రు. ఆర్తి అగ‌ర్వాల్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమ‌ల్లో న‌టించి కుర్రాళ్ల మ‌దిని దోచుకున్నారు. 2001లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన సూప‌ర్ హిట్ సినిమా నువ్వునాకు న‌చ్చావ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ త‌ర‌వాత నాలుగేళ్ల పాటూ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్ గా రానించారు.

కెరీర్ పీక్స్ లో ఉన్న‌స‌మ‌యంలోనే హీరో త‌రుణ్ తో ఆర్తి ప్రేమలో ఉందంటూ అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో నువ్వులేక నేనులేను, సోగ్గాడు రెండు సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్లోనే తెర‌కెక్కాయి. ఆ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని.. ఆర్తీ అయితే త‌రుణ్‌ను పిచ్చిగా ప్రేమించేసింద‌న్న పుకారు గుప్పుమంది. ఆ వార్త‌లు వ‌చ్చిన త‌ర‌వాత ఆర్తి అగ‌ర్వాల్ కు సినిమా అవకాశాలు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి.

త‌రుణ్ తో ప్రేమాయ‌ణం వ‌ల్లే ఆర్తి అగ‌ర్వాల్ కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంద‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అలాంటి స‌మ‌యంలోనే ఆర్తి అగ‌ర్వాల్ విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దాంతో త‌రుణ్ తో ఆర్తి అగ‌ర్వాల్ పెళ్లికి అత‌డి కుటుంబ స‌భ్యులు నిరాక‌రించార‌ని ఆ కార‌ణం వ‌ల్లే ఆర్తి అగ‌ర్వాల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది అంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో త‌రుణ్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై అత‌డి త‌ల్లి రోజా ర‌మ‌ణి స్పందిచారు.

ఆర్తి అగ‌ర్వాల్ చాలా మంచి అమ్మాయ‌ని… ఆమెను ఓ సినిమా ఫంక్ష‌న్ లో క‌లిసి మాట్లాడ‌న‌ని చెప్పారు. త‌రుణ్.. ఆర్తి అగ‌ర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని వారి మ‌ధ్య ఎలాంటి ప్రేమ లేద‌ని చెప్పారు. త‌రుణ్ ఆర్తి కెరీర్ లో మంచిగా స్థిర‌ప‌డ్డార‌ని వారు పెళ్లి చేసుకుంటే ఎవ‌రు అడ్డువ‌స్తారని అన్నారు. అంతే కాకుండా వారిద్ద‌రికీ ఇష్టం ఉండే ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా వారిని ఆపేది ఎవ‌ర‌ని ? అన్నారు. ఆర్తి అగర్వాల్ విషం తాగ‌డానికి కూడా త‌రుణ్ కార‌ణం కాద‌ని చెప్పారు.

రోజా ర‌మ‌ణి ఎన్ని చెప్పినా ఆమెకు ఆర్తీని త‌న ఇంటి కోడ‌లిని చేసుకోవ‌డం ఇష్టం లేద‌నే ఇండ‌స్ట్రీ టాక్ ? త‌రుణ్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత ఆర్తీ ఓ ఎన్నారైను పెళ్లి చేసుకున్నా ఆ బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చాక చాలా త‌క్కువ రోజుల‌కే ఆమె చేయించుకున్న ఆప‌రేష‌న్ విక‌టించి మృతిచెందింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news