MoviesLaxmi Rai - Rai Laxmi: ఆ స్టార్‌తో ప్రేమ... ఆ...

Laxmi Rai – Rai Laxmi: ఆ స్టార్‌తో ప్రేమ… ఆ రాంగ్ స్టెప్పే కెరీర్ నాశ‌నం చేసిందా..!

పేరు మార్చుకున్నా పట్టించుకున్న నాధుడే పాపం..అవును లక్ష్మీ రాయ్ పేరు మార్చుకున్నా కూడా ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి నుంచి ఇప్పుడు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమవుతున్న కొత్త మోడల్స్ వరకు సగానికి సగం మంది అసలు పేరు కాకుండా తెరకి కొత్త పేరుతో పరిచయమవుతున్నారు. అయితే, పేరు మార్చుకున్న వారు అదే పేరుతో స్టార్ డం దక్కించుకుంటున్నారు. కొంతమంది మాత్రం పెట్టుకున్న పేరు కలిసి రాక సొంత పేరుతో సినిమాలు చేస్తూ పాపులారీతీ కోసం పాకులాడుతున్నారు.

అయినా సక్సెస్ కాకుండా కనుమరుగవుతున్నవారు సగానికి సగం మంచి ఉన్నారు. అయితే, ఇందులో మరో రకం నటీమణులున్నారు. కొంతకాలం సినిమాలు చేసి జానాలలో, ఇండస్ట్రీ వర్గాలలో మంచి క్రేజ్ తెచ్చుకొని ఫాంలో ఉండి ఆ తర్వాత ఫ్లాపులు రావడం కొత్త హీరోయిన్స్ తాకిడి గట్టిగా తగిలి అడ్రస్ లేకుండా పోతారు. దాంతో గ్యాప్ ఎక్కువగా వస్తుందని భావించి న్యూమరాలజీని నమ్ముకుంటారు.
దాని ప్రకారం తమ పేరులో ఓ అక్షరం కలుపుకోవడం వంటి మార్పులు చేసుకుంటారు.

అలా మార్చిన తర్వాత అవకాశాలు దక్కుతాయని ఎవరో చెప్తే ఆ ప్రకారం పేరులో అదనంగా ఓ అక్షరం చేర్చుకుంటారు. ఇది అందరికీ అంతగా కలిసి రాకపోవచ్చు. అనూహ్యంగా కొందరికి స్టార్ తిరగవచ్చు. అయితే, పేరును తారుమారు చేసుకొని లక్ చేసుకున్న హీరోయిన్ లక్ష్మీ రాయ్. ఈ పేరుతో హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన లక్ష్మీ రాయ్..కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి కూడా ఆకట్టుకుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. దాంతో లక్ష్మీ రాయ్ పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుంది.

హిందీలో జూలీ 2 సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మీ రాయ్. మంచి బోల్డ్ పాత్ర అయినా కూడా ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీకి ఎంత మాత్రం కలిసి రాలేదు. జూలీ 2 హిందీలో డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో హిందీలో మాత్రమే కాకుండా తెలుగులోనూ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఒక్కటే పేరు మార్చుకుంటే స్టార్ హీరోయిన్ అవరు. సినిమాలు రావాలి..అవి భారీ హిట్ అవ్వాలి. అప్పుడే మేకర్స్ పిలిచి అవకాశాలు ఇస్తారు. ఫ్లాప్ హీరోయిన్ ని పట్టించుకోరు. ఇది ఫిక్స్.

అదే స‌మ‌యంలో ఆమె కెరీర్ ప‌రంగా బాలీవుడ్‌లో కూడా రాణిస్తోన్న స‌మ‌యంలోనే అప్ప‌టి భార‌త స్టార్ క్రికెట‌ర్‌గా ఉన్న మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీతో డేటింగ్ చేసింద‌న్న టాక్ వ‌చ్చింది. ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేవారు. అప్ప‌ట్లో వీరి డేటింగ్ విష‌యం నేష‌న‌ల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది కూడా కెరీర్ ప‌రంగా బాగున్న‌ప్పుడు ఆమె వేసిన రాంగ్ స్టెప్ అంటారు. ఏదేమైనా కావాల్సినంత అందం, టాలెంట్ ఉండి కూడా రాయ్ ల‌క్ష్మి స్టార్ కాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news