Moviesఅతిలోక సుంద‌రి శ్రీదేవితో ఆ స్టార్ హీరో పెళ్ళికి అడ్డుప‌డిన అమ్మ‌యి...

అతిలోక సుంద‌రి శ్రీదేవితో ఆ స్టార్ హీరో పెళ్ళికి అడ్డుప‌డిన అమ్మ‌యి ఎవ‌రు..!

దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీదేవి రెండు ద‌శాబ్దాల పాటు భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఒక ఊపు ఊపేశారు. శ్రీదేవికి ముందుగా క్రేజ్ వ‌చ్చింది తెలుగులోనే.. ఇక్క‌డ వ‌చ్చిన క్రేజ్ తోనే శ్రీదేవి బాలీవుడ్ లొకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. బాలీవుడ్ లోకి ఎప్పుడైతే శ్రీదేవి ఎంట‌ర్ అయ్యారో అప్న‌టినుంచి అమె వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. దేశం మొత్తంమెచ్చే అతిలోక‌సుంద‌రి అయ్యారు శ్రీదేవి. సినిమాల‌ప‌రంగా ఎంత టాప్ హీరోయిన్ అయినా అమె జీవితంలోనూ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఆమె హ‌వా చెలాయిస్తే బాలీవుడ్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. శ్రీదేవి వ్య‌క్తిగ‌త, వైవాహిత జీవ‌తం అంత సాఫీగా సాగ‌లేదు. ఆమెకు కూడా కొన్ని ఎపైర్లు ఉన్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అప్ప‌టికే పెళ్ళ‌యి పిల్ల‌లు ఉన్న బోనీక‌పూర్‌నూ అమె రెండో వివాహం చేసుకోవ‌డం అమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు.పైగా వ‌య‌సులో కూడా శ్రీదేవి కంటే బోనీక‌పూర్ చాల పెద్ద.. వారిద్ద‌రి జంటనూ శ్రీదేవి అభిమానులు చూడ‌లేక‌పోయారు.

శ్రీదేవి కెరీర్‌ర్ ప‌రంగా పీక్స్‌లో ఉన్న‌పుడే కొంద‌రు హీరోల‌తో పెళ్ళి ప్ర‌తిపాద‌న‌లు కూడా వ‌చ్చాయి. సినీయ‌ర్ హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో శ్రీదేవి త‌ల్లి త‌మ కూమ‌ర్తెను పెళ్ళి చేసుకోమ‌ని కొరార‌ట. అయితే అప్పుడు రాజ‌శేఖ‌ర్ కేరీర్ ప్రారంభంలో ఉండంతో ఆ ప్ర‌తిపాద‌న‌నూ ఆయ‌న రిజెక్ట్ చేశారు. శ్రీదేవి – రాజ‌శేఖ‌ర్ కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ఆ చ‌నువుతోనే రాజ‌శేఖ‌ర్‌ను పెళ్లి చేసుకోమ‌ని శ్రీదేవి త‌ల్లి కోరార‌ట‌.

అంత‌కు ముందే మ‌రో న‌టుడు చంద్ర‌మోహ‌న్‌తో కూడా శ్రీదేవితో పెళ్ళి చ‌ర్చ‌లు కూడా జ‌ర‌గాయ‌ని అంటారు. రీసెంట్‌గా జేడి చ‌క్ర‌వ‌ర్తి కూడా శ్రీదేవిని ఆమె త‌ల్లి పెళ్లి చేసుకోమ‌ని త‌న చేతులు ప‌ట్టుకున్ని వేడుకున్న విష‌యం చెప్పారు. అలా స్టార్ హీరోల‌తో శ్రీదేవికి పెళ్ళి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చినా ఆమె వాటిని కాదనుకుని బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ప్రేమ‌లో ప‌డింది. అయితే అప్ప‌టికే మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి పెళ్ళియి, పిల్ల‌లు కూడా ఉన్నారు.

మిథున్‌తో క‌లిసి శ్రీదేవి ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించింది. మిథున్ త‌న భార్య యోగితా బాలికి విడాకులు ఇచ్చి వ‌స్తే త‌న కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాన‌ని శ్రీదేవి త‌ల్లి కండీష‌న్లు కూడా పెట్టింద‌ట‌. అయితే యోగితా బాలి మిథున్ జీవితంలోకి వ‌చ్చాకే అత‌డి లైఫ్ ట‌ర్న్ అయ్యింది. శ్రీదేవి కోసం త‌న అదృష్ట‌దేవ‌త అయిన యోగిత‌ను వ‌దులుకునేందుకు మిథున్ ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే ఆమెను రెండో భార్య‌గా ఉంచుకునేందుకు మాత్రం ఓకే చెప్పాడ‌ట‌. ఇది శ్రీదేవి త‌ల్లికి ఇష్టం లేక‌పోవ‌డంతో మిథున్ – శ్రీదేవి పెళ్లి జ‌ర‌గ‌లేదు. అలా ఆ స్టార్ హీరోతో బ్రేక‌ప్ అయ్యాక శ్రీదేవి మ‌ళ్లీ బోనీక‌పూర్ మాయ‌లో ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news