Moviesకలర్స్ స్వాతి దంపతుల మధ్య ఏం జరిగింది.. విడాకుల వార్త‌ల వెన‌క...

కలర్స్ స్వాతి దంపతుల మధ్య ఏం జరిగింది.. విడాకుల వార్త‌ల వెన‌క క‌థేంటి…!

యాంక‌ర్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎద‌గ‌టం అంటే అంత సులువు కాదు. ఇక చాలా మంది యాంక‌ర్స్ హీరోయిన్ గానూ సినిమాలు చేస్తారు. కానీ ప్ర‌స్తుతం ఉన్న పోటీలో రాణించ‌డం అంత సులువు కాదు. కానీ క‌ల‌ర్స్ అనే టీవీ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమై క‌ల‌ర్స్ స్వాతి స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ రాణించింది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. తెలుగులో అష్టా చెమ్మా, కార్తికేయ‌, స్వామిరారా సినిమాల‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక తెలుగు అమ్మాయి అయినా టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో మంచి అవ‌కాశాల‌ను అందుకు అక్క‌డ కూడా హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చింది. ఇక క‌ల‌ర్స్ స్వాతి 2018లో వికాస్ వాసు ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక మిగితా సెల‌బ్రెటీల కాపురాల‌లో గొడ‌వ‌లు వ‌చ్చిన‌ట్టే క‌ల‌ర్స్ స్వాతి కాపురంలోనూ క‌ల‌హాలు మొద‌ల‌య్యాయ‌ని అప్ప‌ట్లో వార్త‌లు గుప్పు మ‌న్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు సార్లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రింగింది.

మొద‌టి సారి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గగా పెద్ద‌లు వారిని కూర్చోబెట్టి స‌ర్ది చెప్పార‌ట‌. ఆ త‌ర‌వాత కొంత కాలానికే మ‌ళ్లీ గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని ప్రచారం జ‌రిగింది. అంతే కాకుండా వీరిద్ద‌రూ విడాకులు తీసుకునే అవ‌కాశాలు కూడా ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రిగింది. దానికి ఓ కార‌ణం కూడా ఉంది స్వాతి త‌న పెళ్లి ఫోటోల‌ను సోష‌ల్ మీడియా నుండి డిలీట్ చేసింది. ఇక ఒక్క‌సారిగా విడాకుల వార్త‌లు గుప్పుమ‌న‌డంతో స్వాతి త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో వీరిద్ద‌రు క‌లిసే ఉన్నార‌ని అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్న క‌ల‌ర్స్ స్వాతి విదేశాల‌లోనే భ‌ర్త‌తో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. నిఖిల్ హీరోగా న‌టిస్తున్న కార్తికేయ-2 తో స్వాతి రీ ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వినిపించినా అవి పుకార్లేన‌ని క్లారిటీ వ‌చ్చింది. మ‌రి ఫ్యూచ‌ర్ లో అయినా ఈ తెలుగందం రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news