Moviesకూతురును క‌లిసిన క‌ళ్యాణ్‌దేవ్‌.. శ్రీజ‌తో విడాకుల నేప‌థ్యంలో ఊహించ‌ని ట్విస్ట్‌..!

కూతురును క‌లిసిన క‌ళ్యాణ్‌దేవ్‌.. శ్రీజ‌తో విడాకుల నేప‌థ్యంలో ఊహించ‌ని ట్విస్ట్‌..!

మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ‌, త‌న భ‌ర్త క‌ళ్యాణ్‌దేవ్‌తో విడిపోయార‌న్న‌ది వాస్త‌వం. వీరిద్ద‌రు వేర్వేరుగా ఉండ‌డంతో పాటు జ‌రుగుతున్న అనేక ప‌రిణామాలే వీరు విడిపోయార‌న్న విష‌యాన్ని చెప్పేస్తున్నాయి. ఇద్ద‌రు యేడాదిన్నర కాలం నుంచే వేర్వేరుగా ఉంటున్నారు. అస‌లు క‌ళ్యాణ్‌దేవ్‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. సేమ్ స‌మంత లాగానే శ్రీజ కూడా ముందు త‌న ఇన్‌స్టా పేరు నుంచి క‌ళ్యాణ్ పేరును తీసేసింది. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్‌తో ఉన్న ఫొటోలు అన్నీ డిలీట్ చేసేసింది.

ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో క‌ళ్యాణ్‌దేవ్‌ను అన్‌ఫాలో చేయ‌డం మొద‌లు పెట్టేసింది. ఈ దంపతుల విష‌యానికి వ‌స్తే శ్రీజ‌కు ముందు భ‌ర్త శిరీష్ ద్వారా ఓ కుమార్తె ఉంది. ఇక క‌ళ్యాణ్‌తో మ‌రో కుమార్తె కూడా క‌లిగింది. ఇప్పుడు శ్రీజ తండ్రి చిరంజీవితో క‌లిసి ఉంటోంది. అటు క‌ళ్యాణ్ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్నాడు. ఇటీవ‌ల శ్రీజ పెద్ద కుమార్తె బ‌ర్త్ డే వేడుక‌ల్లో క‌ళ్యాణ్ లేడు. అలాగే క‌ళ్యాణ్ తల్లి బ‌ర్త్ డే వేడుక‌ల‌కు శ్రీజ రాలేదు.

క‌ళ్యాణ్ ఫ‌స్ట్ సినిమా విజేత‌ను పూర్తిగా భుజ‌నకెత్తుకుని ప్ర‌మోట్ చేసిన మెగా ఫ్యామిలీ ఆ త‌ర్వాత వ‌చ్చిన ఆయ‌న రెండు సినిమాల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఇక క‌ళ్యాణ్‌తో విడాకుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే త‌రువాయి అని.. శ్రీజ త‌న ఫ్రెండ్‌ను మూడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంద‌న్న వార్త‌లు కూడా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీజ మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం చిరుకు ఇష్టం లేక‌పోయినా కూతురు భ‌విష్య‌త్తు కోసం ఆయ‌న అయిష్టంగానే ఓకే చెప్పార‌న్న ప్ర‌చార‌మూ గ‌ట్టిగానే న‌డుస్తోంది.

ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీజ – క‌ళ్యాణ్ కూతురు న‌విష్క తండ్రి క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు రావ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. వీరిద్ద‌రు వేర్వ‌రుగా ఉంటున్న‌ప్ప‌టి నుంచి న‌విష్క త‌ల్లి శ్రీజ వ‌ద్దే ఉంటోంది. ఇప్పుడు కూతురు తండ్రి క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు రావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అటు క‌ళ్యాణ్ కూడా త‌న కూతురు న‌విష్క‌తో ఆహ్లాదంగా గ‌డుపుతోన్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో క‌ళ్యాణ్ బాగా ఉత్సాహంగా ఉన్నాడు.

వీరిద్ద‌రు విడాకులు అధికారికంగా తీసుకున్నారా ? లేదా ? అన్న‌ది తెలియ‌దు. అయితే వీరు విడిపోయినా కూడా పిల్ల‌ల బాధ్య‌త‌లు త‌ల్లిదండ్రులు ఇద్ద‌రికి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే న‌విష్క తండ్రి క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఉండొచ్చంటున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీజ అయితే లేదు.

https://www.instagram.com/reel/CgjlgwxBerO/?utm_source=ig_web_copy_link

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news