ReviewsTL రివ్యూ: ది వారియ‌ర్.. రామ్ మ‌ళ్లీ హిట్ కొట్టాడా...!

TL రివ్యూ: ది వారియ‌ర్.. రామ్ మ‌ళ్లీ హిట్ కొట్టాడా…!

న‌టీన‌టులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్‌: నవీన్ నూలి
మ్యూజిక్‌: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: ఎన్.లింగుసామి
సెన్స‌ర్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం : 155 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 14 జూలై, 2022

చాలా రోజుల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన రామ్ న‌టించిన తాజా సినిమా ది వారియ‌ర్‌. యంగ్ టాలెంటెడ్ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్‌గా కోలీవుడ్ ద‌ర్శ‌కుడు లింగుస్వామి తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో పాటు హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ‌రి వారియ‌ర్ అంచ‌నాలు అందుకుంలో లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
సత్య (రామ్) ఒక డాక్టర్. మ‌నోడు క‌ర్నూలులో ఓ హాస్ప‌ట‌ల్‌కు వ‌స్తాడు. అప్ప‌టికే అక్క‌డ గురు ( ఆది పినిశెట్టి) కంట్రోలింగ్ ఉంటుంది. త‌న దారుణాల‌కు అడ్డు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని చంపుకుంటూ పోవ‌డ‌మే గురుకు తెలిసింది. ఈ క్ర‌మంలోనే స‌త్య‌కు, గురుకు మ‌ధ్య వార్ స్టార్ట్ అవుతుంది. గురు అన్యాయాల‌ను స‌త్య ఎదిరిస్తాడు. విజ‌ల్ మ‌హాల‌క్ష్మి ( కృతిశెట్టి) తో ప్రేమాయ‌ణం న‌డుస్తుంటుంది. ఇదిలా ఉంటే ఐపీఎస్ పాస్ అయ్యేందుకు స‌త్య ఏం చేస్తాడు ? క‌ర్నూలుకు పోలీస్‌గా వ‌చ్చిన స‌త్య ఏం సాధించాడు ? మ‌రి గురు ఏమ‌య్యాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
ది వారియ‌ర్ సినిమాకు మెయిన్ ఫిల్ల‌ర్ హీరో రామ్ ఒక్క‌డే. రామ్ ప‌ర‌కాయ పర‌కాయ ప్ర‌వేశం చేసి చాలా ఎన‌ర్జిటిక్‌గా న‌టించాడు. రామ్ రోల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. ఇక లింగుస్వామి సినిమాల్లో హీరో ఎలా స్టైలీష్‌గా ఉంటాడో ఈ సినిమాలోనూ అంతే స్టైలీష్‌గా రామ్ పాత్ర‌ను తీర్చిదిద్దాడు. పోలీస్‌గా అద‌ర‌గొట్టి ప‌డేశాడు. ఇక హీరోయిన్ కృతిశెట్టి క్యూట్‌లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. విజ‌ల్ మ‌హాల‌క్ష్మిగా ఆమె పాత్ర కొత్త‌గా ఉంది.

ఇక ద‌ర్శ‌కుడు లింగుస్వామి హీరో రామ్‌ను సినిమా ఆద్యంతం ప‌వ‌ర్ ఫుల్‌గా, పోలీస్‌గా చూపించే విష‌యంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక మ‌రో కీల‌క‌మైన రోల్లో న‌దియా పాత్ర బాగుంది. ఆమె ఎమోష‌న‌ల్ సీన్స్‌లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసింది. ఇక విల‌న్ ఆది పినిశెట్టి పాత్ర‌కు త‌గిన‌ట్టుగా చాలా బాగా న‌టించాడు. ఇక స్టోరీ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఫాస్ట్‌గా మూవ్ అయినా ల‌వ్ స్టోరీ సినిమా రేంజ్‌కు త‌గిన‌ట్టుగా లేదు.

సినిమాకు ల‌వ్ ట్రాకే మైన‌స్ అయిన‌ట్టు అనిపించింది. యాక్ష‌న్ సీన్స్‌లో కొన్ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌ర‌కు క‌థ అస్స‌లు క‌ద‌ల‌దు. కొన్ని కీల‌క సీన్లను మ‌రింత ఇంఫాక్ట్ చూపించే ఛాన్స్‌ను ద‌ర్శ‌కుడు ఉప‌యోగించుకోలేదు. సెకండాఫ్‌లో హీరో, విల‌న్ మ‌ధ్య వ‌చ్చే సీన్లు స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమా ఫ‌స్టాఫ్‌లో ఉన్నంత ఆస‌క్తిగా సెకండాఫ్‌లో అంచ‌నాలు అందుకోదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరు…
టెక్నిక‌ల్‌గా చూస్తే లింగుస్వామి ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. టేకింగ్‌, సినిమాను న‌డిపించిన తీరు, న‌టీన‌టుల నుంచి పెర్పామెన్స్ రాబ‌ట్టుకునే విష‌యంలో స‌క్సెస్ అయ్యాడు. అయితే ర‌చ‌యిత‌గా పూర్తి స్థాయిలో మెప్పించ‌లేక‌పోయాడు. క‌థ‌లో స‌రైన ద‌మ్ము లేక‌పోయినా కూడా యాక్ష‌న్‌తో సాగే పాత్ర‌ల‌తో సినిమాను మాస్‌కు క‌నెక్ట్ చేసే విధంగా మ‌లిచాడు. అయితే స్క్రిఫ్ట్‌లో ద‌మ్ములేక‌పోవ‌డం మైన‌స్‌.

ఇక దేవిశ్రీ పాట‌లు బాగున్నాయి. నేప‌థ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ చూస్తే విజువ‌ల్స్ అదిరిపోయాయి. ఇక ఎడిటింగ్ 155 నిమిషాల ర‌న్ టైం ఓకే అయినా.. కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా క్వాలిటీతో సినిమా నిర్మించారు.

ఫైన‌ల్‌గా…
ది వారియర్ యాక్ష‌న్ డ్రామాలో రామ్ న‌ట‌న‌, కృతిశెట్టి అందాలు హైలెట్‌. క‌థ‌లో ద‌మ్ము ఎలా ? ఉన్నా స్లో నెరేష‌న్‌.. కొన్ని సీన్లు మైన‌స్ అయ్యాయి. డాక్ట‌ర్ నుంచి పోలీస్‌గా మార‌డం అనే మెయిన్ లైన్ బాగుంది. స్క్రీన్ ప్లే చాలా వ‌ర‌కు బాగుంది. ల‌వ్ స్టోరీ మైన‌స్‌. ఓవ‌రాల్‌గా త‌న అభిమానుల‌కు, మాస్‌కు బాగా న‌చ్చే ది వారియ‌ర్ మిగిలిన ప్రేక్ష‌కుల‌కు జ‌స్ట్ వ‌న్ టైం వాచ్ మూవీ..

ది వారియ‌ర్ TL రేటింగ్ : 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news