ReviewsTL రివ్యూ: రామారావు ఆన్‌ డ్యూటీ

TL రివ్యూ: రామారావు ఆన్‌ డ్యూటీ

టైటిల్‌: రామారావు ఆన్‌ డ్యూటీ
బ్యాన‌ర్‌: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ర‌వితేజ టీం వ‌ర్క్‌
న‌టీన‌టులు: ర‌వితేజ‌, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు, న‌రేష్‌, నాజ‌ర్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు
నిర్మాత‌లు: సుధాకర్ చెరుకూరి
ద‌ర్శ‌క‌త్వం: శరత్‌ మండవ
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
ర‌న్ టైం: 150 నిమిషాలు
రిలీజ్ డేట్ : 29 జూలై, 2022

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్‌ను క్రాక్ సినిమా ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసింది. క్రాక్ ర‌వితేజ కెరీర్‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. క్రాక్ త‌ర్వాత ఈ యేడాది ర‌వితేజ ఖిలాడీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ అంచ‌నాల‌తో, భారీ బిజినెస్‌తో వ‌చ్చిన ఖిలాడీ అంచ‌నాలు అందుకోలేదు. ఇక త‌క్కువ గ్యాప్‌లోనే ర‌వితేజ ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో సినిమాలో కొత్త‌ద‌నం ఉంద‌ని.. ర‌వితేజ డిప‌రెంట్‌గా ట్రై చేశాడ‌న్న హోప్స్ వ‌చ్చాయి. ఈ రోజు రిలీజ్ అయిన రామారావు త‌న డ్యూటీ క‌రెక్టుగా చేశాడా ? లేదా ? అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
క‌థ‌లోకి వ‌స్తే రామారావు (రవి తేజ్) ఒక సబ్ కలెక్టర్ గా ఉంటూ సిన్సియ‌ర్ ఆఫీస‌ర్‌గా ఉంటాడు. త‌న భార్య
నందిని (దివ్యాంశ కౌశిక్)తో కలిసి చిత్తూరు జిల్లాకు వస్తాడు. అక్క‌డ ఎస్ఐగా ( వేణు తొట్టెంపూడి) ప‌ని చేస్తూ ఉంటాడు. రామారావు త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో అక్క‌డ పెండింగ్‌లో ఉన్న కేసులు చ‌క‌చ‌కా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆ స‌మ‌యంలో రామారావు మాజీ ప్రేయ‌సి మాలిని (రజిషా విజయన్) భర్త మిస్ అవుతాడు. రామారావుకు – మాలినికి ఉన్న లింక్ ఏంటి ? ఆమె భ‌ర్త ఎలా మిస్ అయ్యాడు ? ఈ విచార‌ణ‌లో రామారావుకు తెలిసిన షాకింగ్ నిజాలు ఏంటి ? చివ‌ర‌కు క‌థ ఏమైంది అన్న‌దే స్టోరీ.

TL విశ్లేష‌ణ :
ఈ సినిమాలో ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు యాక్ష‌న్ సీన్ల‌లో బాగా న‌టించాడు. ఇక హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ త‌న క్యూట్‌, హోమ్లీ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. మ‌రో హీరోయిన్ రజిషా విజ‌య‌న్ కూడా పాత్ర వ‌ర‌కు బాగానే చేసింది. కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన మాజీ హీరో వేణు చాలా రోజుల త‌ర్వాత మంచి పాత్ర‌తో మెప్పించాడు. ఇక మిగిలిన న‌టీన‌టులు కూడా పాత్ర‌ల వ‌ర‌కు బాగానే సెట్ అయ్యారు.

ఇక సినిమాలో మాలిని, ఆమె భ‌ర్త పాత్ర‌కు సంబంధించిన ట్రాక్‌, ఆ పాత్ర‌తో క‌నెక్ట్ అయ్యి ఉన్న మిగిలిన పాత్ర‌లు, అక్క‌డ క‌థ సాగిన తీరు బాగుంది. ర‌వితేజ విచార‌ణ చేస్తూ నిజాలు క‌నుక్కోవ‌డం కాస్త ఉత్కంఠ‌గా ఉంది. అయితే సినిమాలో మైన‌స్ పాయింట్లు చాలానే ఉన్నాయి. మెయిన్ లైన్ బాగున్నా దానికి త‌గిన‌ట్టుగా ఉత్కంఠ భ‌రిత‌మైన స్క్రీన్ ప్లే రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ ఫెయిల్ అయ్యాడు.

ఇలాంటి కాన్సెఫ్ట్‌ను తీసుకున్న‌ప్పుడు దానికి త‌గిన‌ట్టుగా క‌థ‌ను న‌డ‌ప‌డంలో ద‌ర్శ‌కుడి అనుభ‌వ రాహిత్యం స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. క‌థ‌లో సైడ్ ట్రాక్స్ ఎక్కువ అవ్వ‌డంతో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అన్న‌ట్టుగా సాగింది. సినిమాలో క్రియేట్ చేసిన చాలా ప్రాబ్ల‌మ్స్ హీరో సింపుల్‌గా సాల్వ్ చేశాడ‌ని ప్రేక్ష‌కుడు మెచ్చేలా ఒప్పించ‌డంలోనూ ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌న‌ప‌డలేదు.

 

రామారావులో కావాల్సినంత యాక్ష‌న్ ఉంది. కానీ సినిమా మాత్రం ఎఫెక్ట్‌గా లేదు. హీరో ట్రాక్ కూడా అంత ఆస‌క్తిగా ముందుకు సాగ‌లేదు. ఆ మెయిన్ ట్రాక్ మీదే సీరియ‌స్‌గా సినిమా ముందుకు న‌డ‌వ‌డం కూడా సినిమాకు మేజ‌ర్ మైన‌స్ అయ్యింది. కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు ఫేక్‌గా ఉండ‌డం, సెకండాఫ్‌ను ద‌ర్శ‌కుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో న‌డిపేందుకు విఫ‌ల ప్ర‌య‌త్నం చేయ‌డం సినిమాకు మైన‌స్‌. ఓవ‌రాల్‌గా సినిమాలో ప్ల‌స్‌ల క‌న్నా మైన‌స్‌లే ఎక్కువుగా క‌నిపిస్తాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నికల్ గా అన్ని విభాగాలు దాదాపుగా ఎఫ‌ర్ట్ పెట్టాయి. సామ్ సి.ఎస్. సంగీతం సినిమాకు బాగా ప్లస్. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ కూడా క్రిస్పీగానే ట్రిమ్ చేశాడు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
ఖిలాడీ త‌ర్వాత ఎన్నో ఆశ‌ల‌తో రామారావు ఆన్ డ్యూటీ అంటూ వచ్చిన ర‌వితేజ‌కు ఈ సినిమా కూడా డిజప్పాయింట్ చేసేలానే ఉంది. కొన్ని యాక్ష‌న్ ఎలిమెంట్స్‌, ర‌వితేజ యాక్టింగ్‌, వేణు కామెడీ మిన‌హా సినిమాలో చెప్పుకోవ‌డానికేం లేదు. ఇంట్ర‌స్టింగ్‌గా లేని బోరింగ్ ట్రీట్‌మెంట్‌, ద‌ర్శ‌కుడికి ఇదే కొత్త సినిమా కావ‌డంతో త‌డ‌బాటు, మెయిన్ క్యారెక్ట‌ర్ వీక్‌గా ఉండ‌డం.. ఫేక్ ఎమోష‌న్స్‌, ల్యాగ్ సీన్స్ సినిమా ఫ‌లితాన్ని తారుమారు చేశాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే.

ఫైన‌ల్ పంచ్ : రామారావు ఇదేం డ్యూటీ సారు..

రామారావు ఆన్ డ్యూటీ TL రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news