Moviesషాకింగ్: సీక్రేట్ గా వేణుస్వామిని కలిసిన హాట్ హీరోయిన్..అందుకోసమేనా..?

షాకింగ్: సీక్రేట్ గా వేణుస్వామిని కలిసిన హాట్ హీరోయిన్..అందుకోసమేనా..?

యస్..తాజా గా సోషల్ మీడియా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇదే నిజమే అని నమ్మాల్సి వస్తుంది. జనరల్ గా చాలా మంది ఈ జాతకాలు , పంచాంగాలు నమ్మరు. వాళ్లకు ఏదో బాధ కలిగి..పరిస్ధితులు బాగోలేవు అని నమ్మితే తప్పిస్తే… చాలా వరకు ఇలాంటి ట్రాష్ అని కొట్టిపడేస్తారు. మరీ ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ అస్సలు ఇలాంటివి నమ్మదు. అయితే, ఓ హీరోయిన్ మాత్రం తన సినీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణూస్వామిని కలిసిందట.

ఆమె మరెవరో కాదు యంగ్ లెటేస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కృతిశెట్టి. కన్నడ బ్యూటీ అయిన తెలుగులో మంచి మంచి అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు అంటే జనాలల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి..తన అందంతో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేసింది. ఆ తరువాత నానితో…ఆ తరువాత నాగ చైతన్య తో వరుసగా హిట్లు కొట్టి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న ఈ బ్యూటి కి రామ్ “ది వారియర్” బ్రేక్ వేసింది. అడ్డంగా ప్లాప్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

దీంతో అమ్మదు పై హ్యూజ్ నెగిటీవ్ ట్రోలింగ్ జరిగింది. కొందరు అయితే..అమ్మడు ఇక హీరోయిన్ గా వేస్ట్ అంటూ కామెంట్స్ చేసారు. దీంతో పాపం కృతి పాప భయపడి..వేణూ స్వామిని కలవడానికి వెళ్లిందట. ఆమె భవిష్యత్తు ఎలా ఉంది. హీరోయిన్ గా సెటిల్ అవ్వగలనా లేదా అంటూ పలు రకాల ప్రస్నలు అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని పరిహార పూజలు కూడా చెప్పారట ఆయన. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ యంగ్ బ్యూటీ ఇలాంటివి కూడా నమ్ముతుందా..అంటూ జనాలు షాక్ అవుతున్నారు. చూడాలి మరి కృతి నెక్స్ట్ సినిమా మాచర్ల నియోజక వర్గం హిట్ అవుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news