Moviesరామ్‌చ‌ర‌ణ్‌తో డేటింగ్ కావాలంటోన్న హీరోయిన్‌.. ఇంత షాక్ ఇచ్చిందేంటి.!

రామ్‌చ‌ర‌ణ్‌తో డేటింగ్ కావాలంటోన్న హీరోయిన్‌.. ఇంత షాక్ ఇచ్చిందేంటి.!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశంలోనే టాప్ హీరోలలో ఒకరు. RRR సినిమాకు ముందు వ‌ర‌కు చ‌ర‌ణ్ క్రేజ్ ఒక‌లా ఉండేది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చేసిన న‌ట‌న‌కు యావ‌త్ ఇండియ‌న్ సినిమా జ‌నాలు అంద‌రూ ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు చ‌ర‌ణ్ నేష‌న‌ల్ లెవ‌ల్లో స్టార్ హీరో అయిపోయాడు. గ‌తంలో చ‌ర‌ణ్ బాలీవుడ్‌లో అపూర్వ ల‌ఖియా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జంజీర్ సినిమా ( తెలుగులో తుఫాన్‌) తో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించింది.

ఇక ఇప్పుడు RRR విడుదల తర్వాత నార్త్‌లో చ‌ర‌ణ్ రేంజ్‌ తదుపరి స్థాయికి వెళ్లింది. ఇక ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు సైతం రామ్‌చ‌ర‌ణ్‌తో న‌టించేందుకు స్వింగ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ చేతిలో కూడా క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ యేడాదే త్రిబుల్ ఆర్‌, ఆచార్య సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చ‌ర‌ణ్ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.

కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యాన‌ర్లో 50వ సినిమాగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ యంగ్ బ్యూటీ రామ్‌చ‌ర‌ణ్‌తో ఏకంగా డేటింగ్ చేయాల‌ని ఉందంటూ పెద్ద బాంబ్ పేల్చింది. ర‌వితేజ తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీలో న‌టించిన అన్వేషీ జైన్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌చ‌ర‌ణ్‌ను సూప‌ర్ హ్యాండ్‌స‌మ్‌గా తాను గ‌ర్తించాన‌ని.. త‌న‌కు అత‌డితో డేట్‌కు వెళ్లాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట చెప్పేసింది.

అన్వేషీ జైన్ ఇంకా త‌న ఫ‌స్ట్ సినిమా రిలీజ్ కాకుండానే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం చూస్తుంటే ఆమె చ‌ర‌ణ్‌ను కాకా ప‌ట్టేందుకు మంచి బిస్కెట్టే వేసిందంటున్నారు. ఒక్క‌సారిగా మీడియా అటెన్ష‌న్‌ను త‌న వైపున‌కు తిప్పుకుంటే టాలీవుడ్‌లో మంచి అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌చ్చ‌న్న‌దే ఆమె ప్లాన్‌గా తెలుస్తోంది. అన్వేషి
రామారావు ఆన్ డ్యూటీలో సీసా అనే ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. కాగా ఈ మూవీ ఈనెల 29న రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news